ఎన్నికల ముందు బాబు నాటకాలు

చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స ధ్వజం..

ఏలూరు: నాలుగున్నరేళ్లలో బీసీలకు మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.ఏలూరు బీసీ గర్జన సభా ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం ఎన్నికల ముందు మాత్రమే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొచ్చారని మండిపడ్డారు.సుదీర్ఘ పాదయాత్ర ద్వారా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బీసీల సమస్యలు గుర్తించారని,బీసీల అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారని తెలిపారు.నేడు బీసీ గర్జనలో బీసీలకు మేలు చేసేవిధంగా బీసీ డిక్లరేషన్‌ను కూడా వైయస్‌ జగన్‌ ప్రకటిస్తారని తెలిపారు.ప్రతి కులం అభివృద్ధి చెందాలంటే కులానికో కార్పొరేషన్‌ ఉండాలన్నారు.అన్ని రంగాల్లో బీసీలు ఎదిగేలా బీసీ డిక్లరేషన్‌ ఉంటుందని తెలిపారు.

బీసీ గర్జన చిరస్థాయిగా నిలిచిపోతోంది.. నేత మజ్జి శ్రీనివాసరావు.

ఏలూరు:నేడు ఏలూరులో జరగబోయే బీసీ గర్జన..బీసీలకు చిరస్థాయిగా గుర్తుండి పోతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు.ఏలూరు బీసీ గర్జన ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనంతగా వైయస్‌ఆర్‌సీపీ బీసీలపై ఒక అధ్యయన కమిటీ వేసిందని తెలిపారు.ప్రతి బీసీ కులస్తుల స్థితిగతులను తెలుసుకుని..పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నివేదిక అందించడం జరిగిందన్నారు. దానికనుగుణంగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా బీసీ కులస్తుల స్థితిగతులను వైయస్‌ జగన్‌ తెలుసుకున్నారన్నారు.బీసీలను ఆర్థిక,సామాజిక,రాజకీయ, విద్యపరంగా పైకి తీసుకురావాలని వైయస్‌ జగన్‌ అంకితభావంతో పనిచేస్తున్నారన్నారని తెలిపారు. దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో బీసీలకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.ఆర్థిక,సామాజిక,విద్య,ఉపాధిపరంగా మెరుగైన ఉన్నతస్థితిని సాధించారని తెలిపారు.

Back to Top