బీసీలు, ఎస్సీల మధ్య ఘర్షణలకు బాబు కుట్ర

మీడియా పాయింట్ వ‌ద్ద‌ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

అమ‌రావ‌తి:  బీసీలు, ఎస్సీల మ‌ధ్య ఘర్ష‌ణ‌ల‌కు చంద్ర‌బాబు కుట్రలు చేస్తున్నార‌ని డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి అనుమానం వ్య‌క్తం చేశారు. ఇవాళ స‌భ‌లో త‌న‌ను కూడా.. రేయ్ నా.కొ. అని అసభ్యంగా మాట్లాడారని నారాయ‌ణ‌స్వామి మీడియా పాయింట్ వ‌ద్ద తెలిపారు. బీసీలను బీసీలతో, ఎస్సీలను ఎస్సీలతో, రెడ్లను రెడ్లతో చంద్రబాబు తిట్టిస్తారు. ఒక ఎస్సీ ఎమ్మెల్యేతో బీసీ వర్గానికి చెందిన స్పీకర్‌ మీద దాడి చేసి లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారు
-గతంలోనూ వైయ‌స్ జగన్ గారి నేతృత్వంలో గెలిచిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని, వారిలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చి, అసెంబ్లీలో నానా తిటలు తిట్టించిన చరిత్ర చంద్రబాబుది
-దాడికి పాల్పడిన ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన డిప్యూటీ సీఎం
- ఒక పవిత్రమైన సభాపతి స్థానంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఉంటే చంద్రబాబు నాయుడుకి కక్ష, పగ, ద్వేషం తప్ప ఇంకేమీ కనపడటం లేదు. చంద్రబాబు నైతిక విధానం ఎలా ఉందంటే.. బీసీ, ఎస్సీలకు గొడవ పెట్టాలని చూశారు. ఒక ఎస్సీని రెచ్చగొట్టి (బాలవీరాంజనేయ స్వామి) స్పీకర్‌ మీద దౌర్జన్యం చేస్తే.. రకరకాలుగా లబ్ధిపొందాలని ఇలాంటి పనులు చంద్రబాబు చేస్తున్నారు. ఎస్సీలను ఎస్సీలతో, బీసీలను బీసీలతో తిట్టించే కార్యక్రమాలు చంద్రబాబు చేస్తారు. అసెంబ్లీలో ప్రభుత్వం నుంచి ప్రజలకు మంచి చేయాలనే కార్యక్రమాలు వదిలేసి ఎంతసేపూ కక్ష, పగ, ద్వేషంతో రగిలిపోతూ స్పీకర్‌ గారి మీద పడుతున్నారు. స్పీకర్‌ గారు కూడా బుద్ధుడు మాదిరిగా సహనంతో ఉన్నాడు కాబట్టి టీడీపీ శాసనసభ్యులు ఆటలు ఆడుతున్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామిని అడ్డు పెట్టుకుని, అతనితో అసెంబ్లీలో దారుణాలు చేయించే చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లోనూ తగిన బుద్ధి చెబుతారు. 
డిప్యూటీ సీఎంగా ఉన్న నన్ను కూడా రేయ్ నా.కొ. అని అసభ్యంగా మాట్లాడారు. దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ పెట్టి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోరుచున్నాను. దాడులకు చంద్రబాబు ఎస్సీలను వాడుకున్నారు. ఎస్సీలు అంతా వైఎస్‌ఆర్‌సీపీ తరుపున గెలిచారు. ఒకే ఒకతను (బాలవీరాంజనేయ స్వామి) టీడీపీ తరుపున వస్తే అతన్ని చంద్రబాబు వాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అతనికి (బాలవీరాంజనేయ స్వామి) ప్రజలే బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులుః
- ఇవాళ జరిగిన సంఘటన చాలా బాధాకరం. 2004 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాం. ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తుందో చూసేవాళ్లం. ఇవాళ జరిగింది చాలా బాధాకరం. టీడీపీ నాయకులు స్పీకర్‌ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. పేపర్లు విసరటం, పోడియం చుట్టుముట్టడం చేశారు. ఇవాళ డోలా వీరాంజనేయ స్వామి ప్రవర్తన బాధాకరం. టీడీపీ వారు ఒక ఎస్సీ ఎమ్మెల్యేను ముందు పెట్టి.. స్పీకర్ పై దాడికి తెగబడటం సరికాదు. స్పీకర్ మీద చేయి చేసుకోవటం విజువల్స్‌లో కనిపిస్తోంది. స్పీకర్‌ను తాకుతుంటే ఆయనకు ఏమైనా అవుతుందని ఎలీజా వెళ్లారు. ఆ తర్వాత ఎలీజాకు ఏం జరుగుతుందో అని మేమంతా వెనక వెళ్లాం. ఇలాంటి సంఘటన జరగటం చాలా బాధాకరం. విజువల్స్ చూసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇలాంటి సంఘటనలతో రాష్ట్రానికి, అసెంబ్లీకి చెడ్డపేరు వస్తుంది. ఇలాంటి ఘటనలు అసెంబ్లీలో జరగకూడదు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top