వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు నరేంద్రపై దాడి

 బాధితుడిని పరామర్శించిన మాజీ ఎంపీ తలారి రంగయ్య

 కళ్యాణదుర్గం: కంబదూరు మండలం పాళ్లూరు వెంకటాంపల్లి గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు నరేంద్రపై దాడి ఘటనపై మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య స్పందించారు. దాడిలో గాయపడిన నరేంద్రను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన నివాసంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నరేంద్ర కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాల్సిన సమయంలో భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని, నరేంద్రపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

గాయపడిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని తలారి రంగయ్య భరోసా ఇచ్చారు. రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజకీయాలను కొనసాగించాలని సూచించారు. 

Back to Top