పార్టీ ఎస్సీ, చేనేత విభాగాలకు నూత‌న అధ్య‌క్షుల నియామ‌కం

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీ ఎస్సీ, చేనేత విభాగాల రాష్ట్ర అధ్య‌క్షుల‌ను నియ‌మించారు. వైయ‌స్ఆర్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షులుగా జూపూడి ప్ర‌భాక‌ర‌రావు, ఎంపీ నందిగాం సురేష్‌ల‌ను నియ‌మించారు. అదే విధంగా పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్య‌క్షులుగా ఎంపీ సింగ‌రి సంజీవ్ కుమార్‌, చిల్ల‌ప‌ల్లి మోహ‌న్‌రావుల‌ను నియ‌మించారు. వైయ‌స్ఆర్ సీపీ ఎస్సీ, చేనేత విభాగాల నూత‌న అధ్య‌క్షుల నియామ‌కానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాల‌యం ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

తాజా వీడియోలు

Back to Top