2021 స్కోచ్ ర్యాంకుల్లో స‌త్తా చాటిన ఏపీ

 
 అమరావతి: 2021 స్కోచ్ ర్యాంకుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం స‌త్తా చాటింది.  ఉత్త‌మ రాష్ట్రాల‌పై స్కోచ్ సంస్థ వివిధ ర్యాంకులు విడుద‌ల చేసింది. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం వ్య‌వ‌సాయం, గ్రామీణాభివృద్ధి, పోలీసు ర‌క్ష‌ణ‌లో ఫ‌స్ట్ ర్యాంకు సాధించింది. జిల్లాల ప‌రిపాల‌న‌లోనూ ఏపీకి మొద‌టి స్థానం వ‌చ్చింది. ఈ-గ‌వ‌ర్నెన్స్‌లో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ట్రాన్స్‌ఫోర్ట్ విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. ఆయా రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు, ప్ర‌జా సంక్షేమం , అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ర్యాంకుల‌ను ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. విద్యార్థులు, వృద్ధులు, విక‌లాంగులు ఇలా అనేక వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. స్కోచ్ ర్యాంకులు ద‌క్క‌డం ప‌ట్ల అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జా సేవ మ‌రింత ముమ్మ‌రం చేసేందుకు ఈ అవార్డులు ప్రోత్స‌హ‌క‌రంగా ఉంటాయ‌ని అధికారులు, పార్టీ శ్రేణులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి.

ఇక‌, పరిపాలనలో సంస్కరణలు, విప్లవాత్మక పథకాలతో సంక్షేమాన్ని ప్రజల ముంగిటికే తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ‘సీఎం ఆఫ్ ద 2021 ఇయర్‌’ అవార్డుకు స్కోచ్‌ గ్రూపు ఎంపిక చేసింది. పాలనలో ఉత్తమ ప్రతిభ విభాగంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలనలో విప్లవాత్మక మార్పులతో పారదర్శకతకు పెద్దపీట వేసిందని స్కోచ్‌ గ్రూప్‌ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో చేపట్టిన 123 ప్రాజెక్టులపై ఏడాది పొడవునా జరిగిన అధ్యయనంలో పాలనలో ఉత్తమ ప్రతిభ కనపరిచినట్లు తేలిందని స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ తెలిపారు. ఈ మేర‌కు క్యాంపు క్యార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ‘సీఎం ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును ఆయన అందజేశారు. 

ఆదర్శంగా ఆర్బీకేలు..
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రాజెక్టు స్థాయి ఫలితాల అధ్యయనం ఆధారంగా సీఎం ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ను ఎంపిక చేసినట్లు స్కోచ్‌ గ్రూపు చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ తెలిపారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన ఫలితాలు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. ముందుగానే ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయడం ఆసక్తికర నమూనాగా నిలిచిందని వెల్లడించారు. దీనివల్ల రైతులకు భారీ ప్రయోజనం కలగడంతో పాటు మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

వైయ‌స్‌ఆర్‌ చేయూత ద్వారా మహిళల ఆర్ధిక సాధికారతకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని చెప్పారు. నాలుగు సంవత్సరాల పాటు జీవనోపాధికి చేయూ త, అనుసంధాన రుణాలు ఇవ్వడం ద్వారా మహిళ ల ఆర్ధిక సాధికారతకు దోహదం చేశారన్నా రు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇది గొప్ప ఉదాహరణగా నిలుస్తుం దని తెలిపారు. దిశ, అభయ పథకాల ద్వారా మహిళల భద్రత, రక్షణకు చర్యలు తీసుకున్నారని, తద్వారా శాంతి భద్రతలు వెల్లివిరియడంతోపాటు మహిళల్లో భరోసా పెరిగి గణనీయమైన మార్పులు తెచ్చిందని తెలిపారు. 

కోవిడ్‌ నియంత్రణలో సమర్థంగా..
కోవిడ్‌–19 నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా స్పందించిన తీరు, తీసుకున్న చర్యలతో పాటు 123 ప్రాజెక్టులపై ఏడాది పాటు జరిపిన అధ్యయనంలో మెరుగైన ఫలితాలు స్పష్టంగా కనిపించాయని స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ వివరించారు. పాలనను పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు గత రెండేళ్లలో రాష్ట్రంలో పలు విప్లవాత్మక చర్యలు, నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. వివిధ రంగాల్లో వినూత్న చర్యలు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌కు దక్కుతుందన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top