పథకాలన్నీ ఎత్తేయాలన్నదే ఎల్లో పార్టీ యోచన  

ప్ర‌తిప‌క్ష పార్టీ, ఎల్లో మీడియా తీరును ఎండ‌గ‌ట్టిన ఏపీ మంత్రులు

 పేదల పథకాలను ఎత్తేయమంటారా?:  పలువురు రాష్ట్ర మంత్రులు

పొరపాటున టీడీపీకి ఓటు వేస్తే సర్వం మంగళం

సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ గోవిందా.. గోవిందా..

తెలుగుదేశం పార్టీ తన మాటను ఈనాడుతో చెప్పించింది

అదే ఇవాళ ఆ పత్రికలో ప్రచురితమైన కధనం

రాష్ట్రంలోని పేద వర్గాలంటే ఆ వర్గాలకు కడుపుమంట

డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు నాగార్జున..

అమర్‌నాథ్, వేణుగోపాలకృష్ణ, ఉషశ్రీ చరణ్‌ వెల్లడి

రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు

వాటన్నింటినీ ఆపేసి, రెండో మూడో అమలు చేయాలి

ఇదే ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా అడుగుతున్నాయి

వీళ్ళు మనుషులేనా? వీరు నడుపుతున్నది పత్రికలేనా? 

వీళ్ళు నడుపుతున్నది రాజకీయ పార్టీయేనా?

వీరు ప్రజా జీవితంలో ఉండటానికి అర్హులేనా?

గుర్తు చేసిన రాష్ట్ర మంత్రులు 

సంక్షేమ పథకాల ద్వారా రూ.1.4 లక్షల కోట్లు పంపిణీ

ఆ మొత్తం నేరుగా వారి చేతిలో పెట్టటం నేరమా?

ఇది ఎంత నీచమైన, హేయమైన ఆలోచన?

ఈ ప్రభుత్వం ప్రజల చేతిలో డబ్బు పెట్టటం తప్పంటున్నారు

ఆనాటి జన్మభూమి కమిటీల దుర్మార్గం బాగుందని..

వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పింఛన్‌ ఇవ్వటం దుర్మార్గం అని..

రాస్తున్నాంటే ఇంతకు మించిన నీచం ఉంటుందా?

వేర్వేరు ప్రెస్‌మీట్స్‌లో సూటిగా ప్రశ్నించిన మంత్రులు

అమ‌రావ‌తి:   సంక్షేమ పథకాలన్నీ ఎత్తేయాలన్నదే ఎల్లో పార్టీ యోచన  అని ఏపీ మంత్రులు మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష పార్టీ, ఎల్లో మీడియా తీరును మంత్రులు ఎండ‌గ‌ట్టారు. అమరావతిలోని సచివాలయంలో డిప్యూటీ సీఎం (ఎక్సైజ్‌ మంత్రి) కె.నారాయణస్వామి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  మేరుగ నాగార్జున, విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం (పంచాయతీరాజ్‌–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి) బూడి ముత్యాలనాయుడు, తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  గుడివాడ అమర్‌నాథ్, కాకినాడలో బీసీ సంక్షేమం, ఐ అండ్‌ పీఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి   చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కళ్యాణదుర్గంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి  కేవీ ఉషశ్రీ చరణ్ మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు.

 మనసులో మాట చెప్పారు:
    తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదల్చుకున్నదో ఈనాడుతో చెప్పించేశారు. జగన్‌గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటిరీ రద్దు చేయాలన్నది ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా, ఎల్లో ఛానళ్ల ఆలోచన. అదే వారి వాదన. తమకు పొరపాటున ఎవరైనా ఓటు వేస్తే సర్వం మంగళం. పథకాలన్నీ గోవిందా.. గోవిందా. ఈరోజు ఈనాడు పత్రిక చూస్తే.. వీరెంత దుర్మార్గులో.. రాష్ట్రంలోని పేద వర్గాలంటే వీరికి ఎంతటి కడుపు మంటో అర్ధం అవుతుంది. 
    ‘ప్రభుత్వం డబ్బులు పంచే తమాషాలు ఆపాలి’ అని ఈరోజు ఈనాడులో రాశారు. అలాగే ‘ప్రభుత్వం ఏవో రెండు, మూడు కార్యక్రమాలు అమలు చేస్తూ మిగిలిన వాటిని నిలిపివేస్తేనే మనకు మనుగడ ఉంటుంది’ అని మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంతో చెప్పించి ఆ పత్రికలో ప్రచురించారు.

అదే ఆ పార్టీ, ఎల్లో మీడియా ఉద్దేశం:
    దీని అర్థం ఏమిటి? అనేక పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలకు అందుతున్న లబ్ధిని ఆపేయాలని.. మా చంద్రబాబుకు పొరపాటున ఎవరైనా ఓటు వేస్తే వాటన్నింటినీ ఆపేస్తాడని చెప్పడం ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా ఉద్దేశం.

ఏమిటా పథకాలు?:
– జగనన్న అమ్మ ఒడి. 44.5 లక్షల తల్లులకు. 84 లక్షల పిల్లలకు లబ్ధి. ఇప్పటి వరకు అందిన లబ్ధి ఏకంగా రూ.13,022 కోట్లు. అమ్మ ఒడి ఆపాలన్నది వీరి ఉద్దేశం.
– వైయస్సార్‌ రైతు భరోసా. ఏకంగా 52.4 లక్షల రైతులకు లబ్ది. ఇప్పటి వరకు రైతులకు అందిన లబ్ధి ఏకంగా రూ.20,162 కోట్లు. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– వైయస్సార్‌ చేయూత. ఏకంగా 25 లక్షల కుటుంబాలకు లబ్ధి. అందించిన సహాయం అక్షరాలా రూ.9,180 కోట్లు. ఈ పథకాన్నీ ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– వైయస్సార్‌ ఆసరా. దీని వల్ల ఇప్పటి వరకు 78.75 లక్షల కుటుంబాలకు లబ్ధి. అందించిన లబ్ది ఏకంగా రూ,12,758 కోట్లు. ఈ పథకాన్ని కూడా ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– ఇళ్ల పట్టాలు. ఇళ్ల నిర్మాణం. ఏకంగా 31 లక్షల కుటుంబాలకు లబ్ధి. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం. దీని వల్ల అంతిమంగా కలిగే లబ్ధి దాదాపు 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు.
– ఉచిత కరెంటు.. పల్లెల్లో ఎస్సీ ఎస్టీల్లో 200 యూనిట్లలోపు వాడుకునే కుటుంబాలకు. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు.. 18 లక్షల పంప్‌సెట్లకు ఉచిత కరెంట్‌. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– జగనన్న విద్యా దీవెన. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. 21.5 లక్షల విద్యార్థులకు ప్రయోజనం. పథకంలో ఇంతవరకు కలిగిన లబ్ధి ఏకంగా రూ.7,000 కోట్లు. విద్యా కానుక మీద చేసిన ఖర్చు మరో రూ.1500 కోట్లు. ఈ పథకాలను ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– జగనన్న వసతి దీవెన.. 19 లక్షల పిల్లలకు ప్రయోజనం. ఇంతవరకు కలిగిన లబ్ధి రూ.3,230 కోట్లు. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– జగనన్న గోరుముద్ద.. 43.26 లక్షల మందికి లబ్ధి. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా అందించిన లబ్ధి ఏకంగా రూ. 2,640 కోట్లు. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– నాడు–నేడు.. రాష్ట్రంలోని 50 వేలకు పైగా బడులు, అన్ని ఆసుపత్రులకు లబ్ధి. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– వ్యవసాయానికి సున్నా వడ్డీ రుణాలు, పంటల బీమా.. అర కోటికి పైగా రైతులకు లబ్ధి. ఈ రెండు పథకాల్లో ఇప్పటిదాకా అందిన లబ్ధి ఏకంగా రూ.5,000 కోట్లు. చంద్రబాబు మాదిరిగా ఈ పథకాలను ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– డ్వాక్రా బృందాలకు సున్నా వడ్డీ రుణాలు. దాదాపు కోటి మంది అక్కచెల్లెమ్మలకు ఇపμటిదాకా రూ.2,354 కోట్ల లబ్ధి. ఈ పథకాన్ని కూడా ఆపేయాలన్నది రామోజీరావు కోరిక.
– వైయస్సార్‌ పెన్షన్‌ కానుక– వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు రూ.2500 íపింఛన్‌. 62 లక్షల మందికి నెలనెలా లబ్ధి. ఇప్పటివరకు అందిన లబ్ధి ఏకంగా రూ.49 వేల కోట్లు. దీన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– వైయస్సార్‌ నేతన్న నేస్తం.. 82 వేల కుటుంబాలకు ఇప్పటివరకు రూ.577 కోట్ల లబ్ధి. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– వైయస్సార్‌ కాపు నేస్తం 3.3 లక్షల కుటుంబాలకు ఇప్పటివరకు రూ.982 కోట్ల లబ్ధి. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– వైయస్సార్‌ ఈబీసీ నేస్తం. దాదాపు 4 లక్షల కుటుంబాలకు ఇప్పటివరకు రూ.589 కోట్ల లబ్ధి. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– జగనన్న చేదోడు. దాదాపు 3 లక్షల కుటుంబాలకు ఇప్పటివరకు రూ.594 కోట్ల లబ్ధి. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– జగనన్న తోడు.14.16 లక్షల కుటుంబాలకు రూ.1416 కోట్ల లబ్ధి. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– వైయస్సార్‌ వాహన మిత్ర. 2.75 లక్షల కుటుంబాలకు రూ.770 కోట్ల లబ్ధి. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ. రాష్ట్రంలోని 95 శాతం కుటుంబాలకు ఇప్పటి దాకా రూ.5750 కోట్ల మేరకు లబ్ధి. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా. రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పరిధిలోని కుటుంబాలన్నింటికీ లబ్ధి. ఇప్పటివరకు రూ.545 కోట్ల మేరకు లబ్ధి. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.
– సంపూర్ణ పోషణ. 34 లక్షల మందికి పైగా లబ్ధి పొందిన ఈ పథకం మీద ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిన వ్యయం ఏకంగా రూ.4900 కోట్లు. ఈ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం.

వీరసలు మనుషులేనా?:
    ఈ పథకాలన్నింటినీ నిలిపి వేసి.. ఇందులో కేవలం రెండో మూడో మాత్రమే అమలు చేయాలని ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా అడుగుతున్నాయి. అసలు వీళ్ళు మనుషులేనా? వీరు నడుపుతున్నది పత్రికలేనా? వీళ్ళు నడుపుతున్నది రాజకీయ పార్టీయేనా? వీరు ప్రజా జీవితంలో ఉండటానికి అర్హులేనా?

ఇదేం దుర్మార్గం?:
    ప్రజా జీవితంలో ఉన్న ఎవరైనా.. ప్రభుత్వం కష్టాలు పడి అయినా ప్రజలకు మంచి చేయాలనుకుంటారు. చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం కేవలం ప్రభుత్వ ఖజానా బాగుండాలి.. మేం బాగుండాలి.. మాబాబు, మా వాళ్ళు బాగుండాలి అనుకుంటుంది. ఇదేం దుర్మార్గం? సంక్షేమ పథకాలు ఆపమంటారా? అవి లేకపోతే ఈ కోవిడ్‌ సమయంలో మన రాష్ట్రంలో పేదల కుటుంబాలు, పేదల పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవటానికే భయం వేస్తుంది కదా?

ఇంతకు మించిన నీచం ఉంటుందా?:
    ఏకంగా రూ.1.4 లక్షల కోట్లు పేదలకు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా వారి చేతిలో పెట్టటం నేరమా? ఎంత దుర్మార్గం ఈ ఆలోచన? జగన్‌గారి ప్రభుత్వం ప్రజల చేతిలో డబ్బు పెట్టటం తప్పు అని.. దాదాపు ఇదే బడ్జెట్‌లో చంద్రబాబు నిలువు దోపిడీ చేయటాన్ని ఒక ఉద్యమంగా సాగించి తనకు కావాల్సిన వారిని మాత్రమే బాగు చేయటాన్ని మంచి పరిపాలన అని.. జన్మభూమి కమిటీల దుర్మార్గం బాగుందని, వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పింఛన్‌∙ఇవ్వటం దుర్మార్గం అని రాస్తున్నాంటే ఇంతకు మించిన నీచం ఉంటుందా?

ప్రభుత్వం–సామాజిక న్యాయం:
    70 శాతం మంత్రి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇవ్వటం అంటే దాని అర్ధం ఏమిటి? మొదటి విడత మంత్రివర్గంలో 56 శాతం ఇవ్వటం ఒక చరిత్ర అయితే, ఇప్పుడు 70 శాతం పదవులు ఈ వర్గాలకు ఇవ్వటం మహా చరిత్ర. అయిదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాలకు ఇవ్వటం, అది కూడా రెండో సారి ఇవ్వటం మహా చరిత్ర. ఈ వర్గాలకు చంద్రబాబు తన చరిత్రలో గరిష్టంగా ఇచ్చిన పదవులు కేవలం 48 శాతం మాత్రమే.

భయపడుతోంది చంద్రబాబు:
    70 శాతం పదవులు సామాజిక న్యాయం ప్రాతిపదికగా జగన్‌గారు ఇచ్చినందుకు భయపడుతున్నది చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా. జగన్‌ గారు దీనికి భయపడుతున్నారని చంద్రబాబు అంటున్నాడు. ఏం అవసరం అండీ.. వాగ్దానాలు అమలు చేసినందుకు, మేనిఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్‌గా భావించి అమలు చేసినందుకు భయపడాలా? అవినీతి లేకుండా పేదలకు నేరగా డబ్బు వారి చేతిలో ఉంచే వ్యవస్థ ఏర్పాటు చేసినందుకు భయపడాలా? బ్లాక్‌మెయిల్‌ ఎవరు చేయగలరు? లొంగే మనస్తత్వం.. ఓటుకు కోట్లిస్తూ దొరికి పారిపోయి వచ్చిన మనస్తత్వం ఎవరిది? చంద్రబాబుది మాత్రమే కదా? వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరు? చంద్రబాబే కదా? మరి చంద్రబాబు ఏవేవో డైలాగులు చెపμటం ఏమిటి? మంత్రివర్గ‡ విస్తరణలో జగన్‌ గారు భయపడ్డారనటం ఏమిటి?

ఇవన్నీ దేనికి నిదర్శనం?:
    మంత్రివర్గంలో 11 మందిని కొనసాగిస్తే అందులో 9 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. ఇంతకంటే సామాజిక న్యాయం ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా? ఎక్కడో ఎందుకు.. విజయవాడనే తీసుకోండి.. జనరల్‌æ స్థానంలో మేయర్‌ ఒక బీసీ; జడ్పీ ఛైర్మన్‌గా జనరల్‌æ స్థానంలో ఒక బీసీ; కనకదుర్గమ్మ ఆలయ బోర్డు ఛైర్మన్‌గా ఒక బీసీ.. ఇవన్నీ దేనికి నిదర్శనం?
    జిల్లా పరిషత్‌ ఛైర్మన్లలో కేవలం ఒకే ఒక్కటి ఓసీ. మిగిలినవన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకే. ఈ మూడేళ్లలో ప్రతి ఒక్క నియామకంలో, ప్రతి ఒక్క ఎంపికలో ఇదే సామాజిక న్యాయం ఎంపీపీల నుంచి రాజ్యసభ ఎంపీల వరకు అంతటా కనిపించింది. ఆలయ బోర్డుల్లో సగం ఈ వర్గాలకే. బోర్డుల్లో సగం, నియామక పదవుల్లో సగం ఈ వర్గాలకు; సగం మహిళలకు ఇచ్చారు.

అందుకే కడుపు మంట:
    ఇదీ జగన్‌గారి పరిపాలన. పదవులు, నిధులు.. ఏ విషయంలో తీసుకున్నా ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని... సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని బాబు వర్గం వ్యతిరేకించటానికి కారణాలేమిటన్నది అందరికీ ఇప్పటికే అర్ధం అయింది. ఈ కడుపు మంట బ్యాచ్‌కి, వారి అసూయకు మందులు లేవు.. అని రాష్ట్ర మంత్రులు గుర్తు చేశారు.

Back to Top