ఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌లు భేటీ అయ్యారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రమంత్రి షెకావత్‌ను మంత్రులు బుగ్గన, అనిల్ వినతిపత్రం అందజేశారు. 2017–18 సవరించిన అంచనాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్రమంత్రికి వివరించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రానికి జీవనాడి అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంచనాల పెంపు వ్యవహారం కేంద్ర ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రాజెక్టు విషయంపై ఇప్పటికే ఆర్థిక కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పలుమార్లు కలిసి అంచనాల పెంపుపై చర్చించారు.