నేడు ఢిల్లీకి సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీకి వెళుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన అనంతరం శనివారం మధ్యాహ్నానికి సీఎం వైయస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. కాగా, ఈ నెల 12న జగన్‌ ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వివరించి చేయూత నివ్వాలని కోరిన విషయం విదితమే.

తాజా వీడియోలు

Back to Top