విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 17న విశాఖ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఇందుకు సంబంధించి పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున , పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హాతో కలిసి విమానాశ్రయం, ఎన్‌ఏడీ ఫ్లైఓవర్, వీఎంఆర్‌డీఏ పార్కు, ఏయూ కన్వెన్షన్ సెంటర్, వైజాగ్ కన్వెన్షన్, పీఎం పాలెం ప్రాంతాలను పరిశీలించారు. సీఎం వైయస్ జగన్ విశాఖ పర్యటన వివరాలు.. ►రేపు విశాఖపట్నంలో సీఎం వైయస్ జగన్ పర్యటన ►విశాఖ నగరంలో పలు అభివృద్ది ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవం ►సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖ బయలుదేరనున్న సీఎం ►సాయంత్రం 5.20 గంటలకు ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన మరో 6 ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్న సీఎం ►సాయంత్రం 6.00 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ ఫంక్షన్‌కు హాజరవనున్న ముఖ్యమంత్రి ►సాయంత్రం 6.20 గంటలకు ఉడా పార్క్ వద్ద ఉడా పార్క్‌తో పాటు జీవీఎంసీ అభివృద్ది చేసిన మరో 4 ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్న సీఎం ►సాయంత్రం 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం ►అనంతరం రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరం తిరుగు పయనం