గవర్నర్‌తో  సీఎం వైయ‌స్‌ జగన్ మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీఅయ్యారు. సాయంత్రం రాజ్‌భవన్‌లో ఆయన్ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కలిశారు.  సుమారు అరగంట పాటు వీరి భేటి సాగింది.   కరోనా వైరస్‌ నేపథ్యంలో శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్‌ సమావేశాల అనంతరం గవర్నర్‌తో సీఎం భేటీ అవుతారు. దానిలో భాగంగానే సీఎం వైయ‌స్ జగన్‌ సమావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వ చేపడుతున్న చర్యలు, పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలపై కూడా గవర్నర్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. 

Back to Top