న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పలువురు కేంద్రమంత్రులతో కూడా సమావేశం కానున్నారు. సీఎం వైయస్ జగన్ గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సాయంత్రం 5.07 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరారు. రాత్రి 7.30 గంటల సమయంలో ఢిల్లీ ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి తను బసచేస్తున్న వన్ జన్‌పథ్‌కి చేరుకున్నారు.