పరిపాలన విషయంలో నాన్న నిర్ణయాలు దేశానికే  మార్గదర్శకాలు

వైయస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌
 

అమరావతి : పరిపాలన, ప్రజాసంక్షేమం విషయంలో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి(నాన్న) నిర్ణయాలు మొత్తం దేశానికే మార్గదర్శకాలయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. తన తండ్రి వైయస్‌ఆర్‌ని గుర్తు చేసుకున్నారు. "పరిపాలన, ప్రజాసంక్షేమం విషయంలో నాన్న నిర్ణయాలు మొత్తం దేశానికే మార్గదర్శకాలయ్యాయి. రాష్ట్రాన్ని నాన్న నడిపించిన తీరు జాతీయస్థాయిలో మనల్ని ఎంతో గర్వించేలా చేసింది.నాన్న భౌతికంగా దూరమైనా పథకాల రూపంలో బతికే ఉన్నారు. ఆయనిచ్చిన స్ఫూర్తి మనల్ని ఎప్పటికీ విలువలబాటలో నడిపిస్తూనే ఉంటుంది''అని పేర్కొన్నారు.

నేడు (సెప్టెంబర్‌ 2) వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కుటుంబ సభ్యులతో కలసి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరారు. వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళుర్పించిన అనంతరం పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించే వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమాల్లో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొంటారు.

Back to Top