అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ బేటీలో సీఎం వైయస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నూతన పారిశ్రామిక విధానానికి ఈ కేబినెట్ బేటీలో ఆమోదం తెలపనున్నారు. వైయస్‌ఆర్ ఆసరా పథకంపై చర్చించడంతో పాటు .. నవరత్నాల్లో మరో హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకోనున్నారు.నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఏపీలో బారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితులపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ పంటల పరిస్థితిపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. కొత్తగా బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. డిసెంబర్ నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ, వైయస్ఆర్ బీమాపై చర్చతో పాటు వైయస్‌ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభంపై చర్చ జరగనుంది. కాగా సెప్టెంబర్ 5న ఇచ్చే వైయస్‌ఆర్ విద్యాకానుకకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది.రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కి ఆమోదం తెలపడంతో పాటు కడప జిల్లా కొప్పర్తి లో ఎలక్ట్రానిక్ మనుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు పై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే భావనపాడు పోర్ట్ ఫేజ్ 1 నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.