సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కేబినెట్ భేటీలో బడ్జెట్ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అజెండాలోని అన్ని అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైయస్‌ఆర్ లా నేస్తం, వైయస్‌ఆర్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైయస్‌ఆర్ కల్యాణమస్తు పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.