అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి బుధవారం ఉదయం సమావేశమైంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి భేటీ అయ్యింది. ఉదయం 8గం. సమయంలో సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అనంతరం.. బడ్జెట్ పత్రులను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఉన్నతాధికారులు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు. ఇవాళ ఉదయం 11గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.