ఐదో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

 అమరావతి: ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు మరో 9 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ముందుకు ఏపీఎస్‌ఆర్టీసీ, కార్మికశాఖ వార్షిక ఆడిట్‌ రిపోర్టు తీసుకురానుంది. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, వైద్యంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. శాసనసభలో ఆమోదించిన 11 బిల్లులను నేడు మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. విద్యుత్‌ సంస్కరణలు, రాష్ట్రంలో రోడ్లు, రవాణా సౌకర్యాలపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

ఎస్సీ సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చ
రాష్ట్రంలో ప్రతీ ఎస్సీ కుటుంబానికి నవ రత్నాల ద్వారా లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి అద్భుతమైన పథకం. ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. 

 

 
 

Back to Top