అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం.. 

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం అయ్యింది. మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.  సంతాప తీర్మానంపై చర్చ అనంతరం అసెంబ్లీ వాయిదా పడనుంది.  ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించాలని శాసన సభ బీఏసీ (బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. 9వ తేదీన గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 10వ తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, చర్చ జరగనుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top