కర్నూలు : రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి, ఇతర తోక పార్టీలు ఎన్నికల్లో కనీసం 25 శాతం పంచాయతీలను కైవసం చేసుకునే దమ్ముందా అని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ సవాల్ విసిరారు. నామినేషన్లు వేసేందుకు దమ్ము లేదు కానీ ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాల విజయ డైరీ డైరెక్టర్, చైర్మన్ ఎన్నిక విషయంలో గట్టి కృషి చేసి భారీ మెజారిటీతో గెలుపొందేందుకు కృషి చేసిన నంద్యాల పార్లమెంట్ ఎమ్మెల్యేలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో సత్తా చాటబోతుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే రేపటి ఎన్నికల్లో సాధించే విజయానికి నిదర్శనమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. డకోటా ఛానళ్లను వెంటపెట్టుకొని నామినేషన్‌లకు, ఎన్నికల ప్రక్రియకు టీడీపీ వెళ్ళినా.. తమకేం అభ్యంతరం లేదని తెలిపారు. రికార్డ్ బ్రేక్ చేయడం, ఎన్నికల్లో హిస్టరీ క్రియేట్ చేయడం ఒక్క వైయస్ జగన్‌మోహన్ రెడ్డికే సాధ్యమని మంత్రి పేర్కొన్నారు.