రైతులను పరామర్శించడం ఇల్లీగల్‌ యాక్టివిటీనా?

అనంతపురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి ఫైర్‌

అనంతపురం : న‌ష్టాల్లో ఉన్న మిర్చి రైతుల‌ను వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప‌రామ‌ర్శిస్తే అది ఇల్లీగ‌ల్ యాక్టివిటీనా అని అనంతపురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి చంద్ర‌బాబును సూటిగా ప్ర‌శ్నించారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ‌స్తున్న‌ ప్రజాదరణను ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు దిగిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం అనంత‌పురంలో అనంత వెంక‌ట్రామిరెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడారు.  గుంటూరు మిర్చియార్డ‌లో రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వైయ‌స్‌ జగన్‌కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. వైయ‌స్ జగన్ ప్రజల్లో తిరగకుండా చేసేందుకు  భద్రత కుదించార‌ని త‌ప్పుప‌ట్టారు.  ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు భద్రత కల్పించలేమని చంద్రబాబు పేర్కొన‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. రైతులను పరామర్శించడం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్‌ యాక్టివిటీసా?. చంద్రబాబు అలా మాట్లాడడం దుర్మార్గం కాదా? అని ప్ర‌శ్నించారు.  కావాలనే వైయ‌స్ జగన్ భద్రతపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంద‌ని ఫైర్ అయ్యారు. మిర్చి రైతులను వైయ‌స్ జగన్ పరామర్శిస్తే తప్పేంటి అని నిల‌దీశారు. వైయ‌స్‌ జగన్ పాలనలో 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించింద‌ని అనంత వెంక‌ట్రామిరెడ్డి గుర్తు చేశారు. విజ‌య‌వాడ‌లో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి తో ఫోటో దిగిన చిన్నారిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోలు దుష్ప్రచారం చేయ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.  అమ్మ ఒడి వస్తోందో.. రాలేదో... నారాయణ, చైతన్య స్కూళ్ల వద్ద అడిగినా చెబుతార‌ని చుర‌క‌లంటించారు. చిన్నారిపై ట్రోలింగ్‌ జరుగుతుంటే చంద్రబాబు, పవన్‌లు ఖండించరా?. వాళ్లకు అసలు రాజకీయ విలువలు లేవా? అని అనంత ప్రశ్నించారు. 

Back to Top