టీడీపీ, పోలీసుల వేధింపులు తాళలేక మ‌హిళా ఆత్మహత్యాయత్నం

బాధితురాలిని పరామర్శించిన అనంత వెంకటరామిరెడ్డి 

అనంతపురం:  క‌ళ్యాణ‌దుర్గం నియోజకవర్గ పరిధిలోని కడదరకుంట గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరురాలు పుష్పలత టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె అనంత‌పురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఆస్పత్రికి వెళ్లి బాధితురాలు పుష్పలతను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 
ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబం అధైర్యపడవద్దని, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వేధింపులకు గురైన వారికి న్యాయం జరిగేలా పోరాడుతామని హామీ ఇచ్చారు.
 

Back to Top