అమ్మఒడి రేపే ప్రారంభం

చిత్తూరు: రాష్ట్ర ప్ర‌భుత్వం అమ్మఒడి ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తోంది. రాష్ట్రంలోని నిర‌క్ష‌రాస్య‌త‌ను రూపుమాపేందుకు, పేద‌రికం చ‌దువుకు అడ్డుకాకూడ‌దు అనే ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అమ్మఒడి ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ నెల 9వ తేదీన చిత్తూరులో అమ్మఒడి ప‌థ‌కాన్ని ముఖ్య‌మంత్రి ప్రారంభించ‌నున్నారు. చిత్తూరులోని పీవీకేఎన్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల మైదానంలో జ‌రిగే అమ్మఒడి స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి త‌దిత‌రులు ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జిల్లా యంత్రాంగం ప‌క‌డ్బందీ ఏర్పాటు చేసింది. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికేందుకు చిత్తూరు జిల్లా ప్ర‌జ‌లు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీ ఏర్పాట్లు చేశారు. 

Back to Top