చంద్ర‌బాబు జైలుకు వెళ్ల‌డం ఖాయం

ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా
 

కడప : ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో చంద్రబాబు ఎన్నో అవినీతి పనులకు పాల్పడ్డారని, తొందర్లోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడుకు వయసు మీద పడిందని, ఆయన రాజకీయాల నుంచి వైదొలగడమే ఉత్తమమని పేర్కొన్నారు. ఆయన కుమారుడు నారా లోకేశ్‌ చేష్టలను భరించలేకనే  టీడీపీకి చెందిన  రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని ఆరోపించారు. అందుకే ముందు జాగ్రత్తగా తన అవినీతిలో భాగస్వామ్యులుగా ఉన్న ఎంపీలను బీజేపీలో చేర్పించారనేది జగమెరిగిన సత్యమని ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top