అమెజాన్‌తో ఆప్కో ఒప్పందం

అమరావతి: చేనేత వస్త్రాలను మార్కెటింగ్‌ చేసేందుకు అమెజాన్‌ సంస్థతో ఆప్కో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఆప్కో వస్త్రాల కొనుగోలును మంత్రి గౌతంరెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలతో అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆప్కో నుంచి 104 రకాల చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ-కామర్స్‌ సాయంతో చేనేత కార్మికుల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 
 

Read Also: ఉపాధి నిధులతో గ్రామ సచివాలయాల నిర్మాణం

Back to Top