పవన్‌తో జాగ్రత్త! లేదంటే జనసేన నేతల చొక్కాలు చించుతారేమో! 

వారాహి యాత్రపై అంబటి రాంబాబు సెటైర్‌..  
 

విజ‌య‌వాడ‌: జనసేన నేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. వారాహి వాహనం ఎక్కిన దగ్గర నుంచి ఆయన పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని అంబటి అన్నారు. పవన్ మానసికి స్థితి సరిగా ఉండటం లేదని వ్యంగ్యాస్త్రాలు సందించారు 

 వారాహి వాహనం వెనకాలే  అంబులెన్స్ ఏర్పాటు చేసి అందులో మానసిక వైద్యున్ని అందుబాటులో ఉంచమని ఏపీ  వైద్య శాఖను కోరుతున్నానని ఎద్దేవా చేశారు. మానసిక స్థితి బాగులేని వారికోసం ఏ మందులు వాడతారో ఆ మందులనే అంబులెన్స్‌లో ఉంచమని చెప్పండని అంబటి సూచించారు. 

పవన్‌ మానసిక పరిస్థితి బాగులేకపోతే మందులిచ్చి వారాహి వాహనం ఎక్కించాలని కోరారు. 'బయటికి లాక్కొచ్చి తంతాను అని మాట్లాడుతున్నారు. లేకపోతే జనసేన నేతల చొక్కాలు పవన్ చించుతారు' అని మంత్రి అంబటి చురకలు అంటించారు. పవన్ బట్టలిప్పి కొట్టడానికి ఇది సినిమా కాదని అంబటి అన్నారు. 
 

Back to Top