పోలవరంపై చంద్రబాబు ఏనాడైనా నిజాలు మాట్లాడారా?

పవన్‌ది శునకానందం

 మంత్రి అంబ‌టి రాంబాబు

 విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు పోలవరంపై  ఏనాడైనా నిజాలు మాట్లాడారా? అని మంత్రి అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. టీడీపీ హయాంలో పోలవరంపై ఏనాడైనా ఆలోచించారా? అని నిల‌దీశారు. పోలవరంపై చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధే లేదన్నారు. మంత్రి అంబటి శనివారం విజయవాడలో పోలవరంపై వీడియో ప్రజంటేషన్‌ ఇచ్చారు. 

ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలమయమే. టీడీపీ హయాంలో తప్పిదాల వల్లే పోలవరం ఆలస్యమైంది. చంద్రబాబు వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. చంద్రబాబు హయాంలో అన్నీ కరువుకాటకాలే. చంద్రబాబు శనిపాదం అడుగుపెడివతే వర్షాలే కురవవు. ఎల్లోమీడియాతో పోలవరంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబే. 

 

 పోలవరానికి పీడ.. రాష్ట్రానికి శని:
    చంద్రబాబు అంత గొప్పనటుడ్ని రాజకీయాల్లో నేను ఇంతవరకు చూడలేదు. సినిమాల్లో ఎన్టీ రామారావును అద్భుతమైన నటుడిగా చూశాం కానీ.. రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు తర్వాతనే ఎవరైనా అన్న విషయం నిన్ననే తెలిసింది. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. పచ్చి అబద్ధాలు మాట్లాడి.. నవరసాలు పండించి ఔరా.. అనే విధంగా నటించాడు. ఈ నటనకు బాబుకు ఆస్కార్‌ అవార్డు ఇచ్చిన తప్పు లేదు. నిజానికి పోలవరం ప్రాజెక్టుకు పీడ.. రాష్ట్రానికి ఒక శని చంద్రబాబు. ఎందుకంటే, పోలవరం పనులు ఒక్క అడుగు కూడా ముందుకెళ్లకుండా కోర్టులకెళతాడు. విమర్శలు చేస్తాడు. బట్ట కాల్చి మీదేసినట్లు ఆరోపణలు చేస్తాడు. 

అది నీ నిర్వాకమే కదా బాబూ?:
    రూ.400 కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్‌ ఎందుకు కొట్టుకుపోయింది? అప్పటి సీఎం చంద్రబాబు అవినీతి, నిర్వాకమే అందుకు కారణం కాదా? ఇది పచ్చి నిజం. కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఏదో విదేశీ కంపెనీని పిలించి రూ.400 కోట్లు వ్యయం చేసి డయాఫ్రం వాల్‌ నిర్మించారు.
(..అంటూ ప్రాజెక్టు పనులు, అప్పడు–ఇప్పటి పరిస్థితిని పీపీటీ ద్వారా చూపిన మంత్రి)
పోలవరం ప్రాజెక్టుకు డయాఫ్రం వాల్‌ అవసరమే. కానీ, అది ఎప్పుడు నిర్మించాలి..? దీనిపై చంద్రబాబుకు అవగాహన ఉంటే సమాధానం చెప్పాలి. నదిని డైవర్ట్‌ చేసి, కాఫర్‌ డ్యాం పూర్తి చేశాక మాత్రమే డయాఫ్రం వాల్‌ వేయాలి. కానీ మీరేం చేశారు?.
    కనీసం స్పిల్‌వే కూడా పూర్తి చేయకుండా, నదిని డైవర్ట్‌ చేయకుండా, అప్పర్‌ లోయర్‌ కాఫర్‌డ్యాంలు పూర్తి చేయకుండానే డయాఫ్రం వాల్‌ నిర్మించారు. అందుకే అది కొట్టుకుపోయింది. ఇల్లు పూర్తి కాకుండానే ఇంటికి దర్వాజ పెట్టినట్టు పోలవరం పనులు పూర్తి కాకుండానే గేట్లు పెట్టిన పనికిమాలిన సీఎం చంద్రబాబు. అదేమంటే, జయము జయము చంద్రన్న అంటూ భజనలు చేయిస్తాడు. ప్రాజెక్టు పనులు జరగకున్నా, అన్నీ పూర్తి చేసినంత బిల్డప్‌ ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది నిజం కాదా బాబూ?. 

పోలవరంపై బాబుది మొసలికన్నీరు:
    ప్రొటోకాల్‌ లేకుండా చేసిన పోలవరం ప్రాజెక్టు పనుల్లో నవయుగ కంపెనీకి తొందరగా బిల్లులు చేయాలనే తాపత్రయం స్పష్టంగా కనిపిస్తోంది. ‘సోమవారం పోలవరం’ అంటూ ఆర్భాట ప్రచారం తప్ప, ప్రాజెక్టు పనులపై బాబు అండ్‌ కో ఏనాడూ దృష్టి పెట్టలేదు. కేవలం డబ్బుల బ్యాగులపైనే వారి దృష్టి కొనసాగింది. అన్ని దారుణాలు చేసిన చంద్రబాబు, ఈరోజు మొసలికన్నీరు కారుస్తూ.. మాపై నిందలు మోపుతున్నాడు. 
 
వీటికి సమాధానం చెప్పగలవా?:
    పోలవరం ప్రాజెక్టును తామే కడతామని విభజన చట్టంలో కేంద్రం ప్రకటించింది. మరి దాన్ని నువ్వు ఎందుకు తెచ్చుకున్నావ్‌ బాబూ?. పోలవరం ప్రాజెక్టుపై నీకంత ఆసక్తి ఎందుకు?. ఆ ప్రాజెక్టుకు నువ్వు రూపకల్పన చేయలేదు. శంకుస్థాపన కూడా చేయలేదు. మరి ఆ ప్రాజెక్టును ఎందుకు ఎత్తుకున్నావ్‌?. 
    ప్రాజెక్టు పనుల కోసం నీ సొంత కాంట్రాక్టర్లను పెట్టుకుని, ఆ ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు దోచుకోవడం కోసం, దాన్ని ఏటీఎంలా మార్చుకోవచ్చన్న దొంగబుద్ధితోనే ప్రాజెక్టును బాబు భుజానికెత్తుకున్నాడు. ఇది వాస్తవం. చివరకు ప్రధాని మోదీ సైతం ఆ మాటే చెప్పారు.
    ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు దోచి పెట్టిన విధానం కూడా ఇక్కడ చెప్పుకుంటే.. 2013–14 రేట్ల ప్రకారం ఒప్పందం కుదుర్చుకుని నవయుగ కంపెనీకి మాత్రం 2016–17 రేట్లు ప్రకారం బిల్లులు చెల్లించిన ప్రబుద్ధుడు చంద్రబాబు. నవయుగ కంపెనీ అనేది రామోజీరావు బంధువులదని ఆ ప్రేమ చూపించాడు. పోలవరంను సర్వనాశనం చేసిన వ్యక్తే చంద్రబాబు. దాన్ని కాదనే ధైర్యం ఉందా? వాటన్నింటికీ సమాధానం చెప్పగలవా బాబూ?. 

ఇప్పుడు శరవేగంగా పోలవరం:
    రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడగానే, గత ఏడాది మే నాటికే పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే పూర్తి చేశాం. అప్పర్‌ కాఫర్‌ డ్యాం కంప్లీట్‌ చేశాం. నది డైవర్ట్‌ అయ్యింది. గేట్లు కూడా బిగించాం. ఇప్పటికే దాదాపు 26 లక్షల క్యూసెక్కుల వరద నీటిని నది డైవర్షన్‌ ద్వారా వదిలారు. అదే విధంగా లోయర్‌ కాఫర్‌ డ్యాం కూడా 2023లో పూర్తి చేశాం. ఎర్త్‌ కం రాక్‌ ఫిల్లింగ్‌ డ్యాంకు కూడా పునాదులు వేశాం. 

ఇరిగేషన్‌పై చిత్తశుద్ధి లేని బిల్డప్‌బాబు:
    చంద్రబాబుకు ఇరిగేషన్‌ ప్రాజెక్టుల మీద అపార అనుభవం ఉన్నట్లు.. తనకు ప్రాజెక్టుల పట్ల విపరీతమైన శ్రద్ధ ఉన్నట్లు బిల్డప్‌ ఇస్తున్నాడు. పోలవరం గురించి సుదీర్ఘంగా మాట్లాడుతున్నాడు. మరి, 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు బాబు ఏనాడైనా పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు ఆలోచన చేయలేదని అడుగుతున్నాను. ఆయన సమాధానం చెప్పగలడా..?  ఈరోజేమో పోలవరం గొప్ప ప్రాజెక్టు.. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు వరదాయిని అంటూ చిలుక పలుకుతున్నాడు బాబు.
    అందుకే, నేను మరోమారు ప్రశ్నిస్తున్నాను. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరం గురించి ఎందుకు ఒక్కసారైనా ఆలోచించ లేదయ్యా పెద్దమనిషి ..? నీ దగ్గర సమాధానం ఉందా..? ఉంటే చెప్పు.. అదే కాదు. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టు గురించైనా చెప్పు. ఈ ప్రాజెక్టుల మీద ఏవిధమైన చిత్తశుద్ధి లేని వ్యక్తి చంద్రబాబు.
    ఆనాడు ఎన్టీ రామారావు మొదలుపెట్టిన హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను చివరికి దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పూర్తి చేశారు. అదే వైఎస్‌ఆర్‌ గారి హయాంలో పోలవరం ప్రాజెక్టునకు శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఇది అందరూ అంగీకరించాల్సిన యధార్థం. అలాంటిది, చరిత్రను మరిచి అన్నీ నేనే మొదలుపెట్టాను. నేనే పూర్తి చేశానంటూ చంద్రబాబు బిల్డప్‌లు ప్రజలకు అర్ధమవుతూనే ఉన్నాయి. 

బాబు బతుకంతా అబద్ధాలమయం:
    ఇటీవల చంద్రబాబు మా నాయకుడు జగన్‌గారిని ఉద్దేశించి ‘ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దాడారు’ అన్నారు. మరి, ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేని.. కనీస అవగాహన లేని నువ్వు.. ఆనాడు ఎన్టీ రామారావు, దివంగత మహానేత వైయస్సార్‌గారు పునాదులు వేసి పూర్తి చేసిన ప్రాజెక్టుల్ని కూడా నువ్వే పూర్తి చేశానని చెప్పడాన్ని ఏమంటారు..? వాళ్లకు పుట్టిన బిడ్డను నువ్వు ముద్దాడినట్టు కాదా..? అంటే, గతంలో నువ్వు అన్న మాట నిన్ను నువ్వే ఉద్దేశించుకుని అన్నావా బాబూ..?
    14 ఏళ్లు అధికారం వెలగబెట్టిన బాబు ఇరిగేషన్‌ ప్రాజెక్టుల మీద నోరు తెరవకుండా.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గుర్తుకొచ్చి బిల్డప్‌లు ఇస్తున్నారని అందరికీ తెలిసిపోతుంది. అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారని గతంలో అనేవారు కదా..? అది తప్పు. ఆడపిల్ల పుడితే ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టుగా భావించాలి. అయితే, ఇప్పుడు అబద్ధాలాడితే పుట్టేది లోకేశ్‌ లాంటి మొద్దబ్బాయి. ఎందుకంటే బాబు బతుకంతా అబద్ధాలమయం.

ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసిన బాబు:
    చంద్రబాబుకు వయసు పెరిగే కొద్దీ మరీ పైత్యం పెరిగిపోతుంది. అధికారంలో లేనని.. అధికారంలోకి మరలా తిరిగి రాలేననే ఫ్రస్టేషన్‌లో తనేం మాట్లాడుతున్నాడో బాబుకు తెలియడం లేదు. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న చంద్రబాబుకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను.
    నన్ను పదేపదే ఆంబోతు ఆంబోతు అని అంటున్నాడు కదా.. ఒక మంత్రిని పట్టుకుని అలా అవమానిస్తూ మాట్లాడటానికి బాబుకు సిగ్గుండాలి కదా? ఎన్టీఆర్‌ అల్లుడు అన్న ఒక్క మర్యాదతోనే ఆగుతున్నాను కానీ, నీ పరువు తీయడం నాకు ఒక్క క్షణం కూడా పట్టదు. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే వ్యక్తి చంద్రబాబు అన్నది నూటికి నూరుపాళ్లు నిజం. అదే నేను చెబుతున్నాను.

రాజకీయంగా ఎదుర్కోలేక..:
    నా డ్యాన్స్‌ ఆనందతాండవం. పవన్‌కళ్యాణ్‌ది శునకానందం.
పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తి పెద్ద సినిమా నటుడు. నిన్న రిలీజ్‌ అయిన సినిమాలో నా మాదిరిగా ఒక క్యారెక్టర్‌ పెట్టి డ్యాన్స్‌ వేయించాడని విన్నాను. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక మరీ ఇంతలా దిగజారిపోయాడా అని నవ్వుకున్నాను. రాజకీయంగా నన్ను ఢీ కొట్టలేని అసమర్థుడు పవన్‌కళ్యాణ్‌.

పవన్‌ది శునకానందం:
    మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేను సంక్రాంతి పండుగకు నా నియోజకవర్గ ప్రజలతో ఆనందాన్ని పంచుకుంటూ డ్యాన్స్‌ వేసిన మాట నిజమే. గెలిచినోడు డ్యాన్స్‌ వేస్తే సంక్రాంతి. ఓడినోడు డ్యాన్స్‌ వేస్తే అది చీకటిరాత్రి. అందుకే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌వి చీకటిరాత్రి డ్యాన్సులు. నాది సంక్రాంతి డ్యాన్స్‌. ఆరోజు నా డ్యాన్స్‌  ఆనందతాండవం. మరి, ఇప్పుడు నా డ్యాన్స్‌ను కించపరుస్తూ ఎవరో ఖర్చుపెట్టి తీసిన సినిమాలో నన్ను ఇమిటేట్‌ చేయడం పవన్‌కళ్యాణ్‌ శునకానందమే.
    నేను ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకుని డ్యాన్స్‌ వేసే వ్యక్తిని కాదు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ డబ్బులు తీసుకుని డ్యాన్స్‌ వేసే పవన్‌కళ్యాణ్, నా డ్యాన్స్‌ను కామెంట్‌ చేసే స్థాయికి దిగజారినందుకు జాలిపడుతున్నాను.

తాజా వీడియోలు

Back to Top