వ్య‌వ‌‌సాయ‌ ఉత్పత్తులకు విలువ దక్కాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

సచివాలయం: రైతు పండించే ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో పాటు వాటికి విలువ దక్కాలన్నదే వైయస్‌ జగన్‌ ప్రభుత్వ ఆలోచన అని, అన్నదాతకు ప్రతి విషయంలో అండగా ముఖ్యమంత్రి నిలిచారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సచివాలయంలో మంత్రి కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది రూ.2.31 లక్షల కోట్లు క్రెడిట్‌ ప్లాన్‌గా నాబార్డు నిర్ధారించిందని చెప్పారు. రూ.1.58 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలుగా నిర్ధారించారని, ఇందులో ప్రత్యేకంగా రూ.1.13 లక్షల కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. 

కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో ఇంకా బ్యాంకర్లు వెనకాడుతున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. 4 లక్షల మందికి పైగా కౌలు రైతులకు సీసీఆర్‌ కార్డులు జారీ చేశామన్నారు. రూ.2,900 కోట్లతో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలోనూ ఫుడ్‌ ప్రాజెసింగ్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేసే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. వ్యవసాయంతో పాటు సహకార రంగాన్ని సైతం పూర్తిగా బలోపేతం చేస్తున్నామన్నారు. మార్కెట్‌ యార్డులను నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. 
 

Back to Top