ఇక పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు

శాసన సభలో బిల్లుకు ఆమోదం
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం  గ్రామ వాలంటీర్ల భర్తీకి చర్యలు తీసుకోగా, గ్రామ సచివాలయాలకు త్వరలోనే నోటిఫికేషన్‌ వెలుబడనుంది. ఇక పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుకు మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తెచ్చారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాల బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని,  పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానం తెస్తామని సీఎం వైయస్‌ జగన్‌ సభలో ప్రకటించారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యంపై యువతకు శిక్షణ ఇస్తామని సీఎం చెప్పారు. ఈ బిల్లు ఆమోదం పొందడంతో స్థానిక యువతకు ఉద్యోగాల జాతర మొదలైందని చెప్పవచ్చు. బిల్లు ఆమోదంపై సీఎం వైయస్‌ జగన్‌కు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
 

Back to Top