తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి (24.01.2024) తిరుపతి లో పర్యటించనున్నారు. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు, అక్కడ తాజ్ హోటల్‌లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.