23న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఒంగోలు ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎల్లుండి (23.02.2024) ఒంగోలు న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఒంగోలు నగర పరిధిలోని నిరుపేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొన‌నున్నారు.

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఒంగోలు మండలం ఎన్‌.అగ్రహారం చేరుకుంటారు, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Back to Top