18న జ‌గ‌న‌న్న ప్ర‌గ‌తిప‌థం ర్యాలీ

గుంటూరు:  విజయవాడ లో ఈ నెల 18 న సాయంత్రం 4.00 గంటలకు "జగనన్న ప్రగతిపథం" ర్యాలీ నిర్వ‌హిస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ మర్రి రాజశేఖర్ తెలిపారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్‌, రాష్ట్ర ఐటీ వింగ్ కో ఆర్డినేటర్ వేములకొండ తిరుపతి రావుతో క‌లిసి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ జగనన్న ప్రగతి పధం పోస్టర్ విడుదల చేశారు.  జగనన్న ప్రభుత్వం  మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం వైయస్ఆర్ సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో గత పాలనలో జరగని, ప్రస్తుత పాలనలో జరిగిన రాష్ట్ర ప్రగతి వివరించడమే లక్ష్యంగా  నవంబర్ 18 వ తారీఖున సాయంత్రం 4 గంటలకు  విజయవాడ లో తలపెట్టిన "జగనన్న ప్రగతిపథం" ర్యాలీ విజయవంతం చేయాల‌ని మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ పిలుపునిచ్చారు. 

Back to Top