నంద్యాల జిల్లా: శ్రీశైలం నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆత్మకూరు పట్టణానికి చెందిన 12 వార్డు నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో టీడీపీ పార్టీనీ వీడి శివ పాములేటి, అనిల్, ఎల్లప్ప, సుబ్బరాయుడు వీరితోపాటు 120 నాయి బ్రాహ్మణ కుటుంబాలు, వార్డు ప్రజలు శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి శ్రీశైలం నియోజవర్గ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి , శిల్పా చక్రపాణి రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరడంతో తమ ఆకర్షితులమై టీడీపీ పార్టీని వీడి వైయస్ఆర్‌సీపీలోకి చేరడం జరిగిందన్నారు. రాబోవు ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గం నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.