వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోలవరం పూర్తి చేస్తాం

వైయస్‌ఆర్‌ ఉండి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది

పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణం

కాకుల కక్కుర్తి కోసం పోలవరాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారు

కాంట్రాక్టులు, కమీషన్ల కోసం రెండేళ్ల పాటు బాబు కాలయాపన

పోలవరంపై చంద్రబాబు రోజుకో రకంగా మాట్లాడుతున్నారు

ఇకనైనా చంద్రబాబు జిమ్మికులు, మోసాలు ఆపాలి

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ

రాజమండ్రి: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్న పోలవరం ప్రాజెక్టును ఆయన కుమారుడు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణిత సమయంలోనే పూర్తి చేస్తారని పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చం్దరబాబు 2014లో అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టులు, కమీషన్ల కోసం రెండేళ్ల సమయాన్ని వృథా చేశారని, దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఉండి ఉంటే ఎప్పుడో పోలవరం పూర్తి అయ్యేదని చెప్పారు. పోలవరంపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. 

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలలో తప్పులు జరిగాయని, ఓటు ఒక పార్టీకి వేస్తే..మరో పార్టీకి వేసినట్లు కనిపించాయని చంద్రబాబు ఏదేదో మాట్లాడి హుందాతనం పోగొట్టుకున్నారు. నిన్నటి రోజు తాను ఇంకా ముఖ్యమంత్రినే అంటూ..తన పదవి కాలం జూన్‌ 8వ తేదీ వరకు ఉందని మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఆయన పరిశీలించడం, చూడటంలో ఎవరికి ఆక్షేపణ లేదు కానీ..ఆయన అధికారంలో ఉన్నపుడు మాటలు..ఎన్నికల సమయంలో మాటలకు పొంతన లేదు. పోలవరం కావాలని ఎంతోమంది కోరుకున్నారు కానీ..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచన, పట్టుదల, చిత్తశుద్ధితో పోలవరం పనులు మొదలయ్యాయి. ఆప్పట్లో ఇన్‌చార్జ్‌ మంత్రిగా తాను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది. ఆ మహానుబావుడు అప్పట్లో శంకుస్థాపనలు చేయడమే కాకుండా, అన్ని పరిమితులను, అనుమతులను కేంద్రం నుంచి తీసుకువచ్చారు. కాలువలను కూడా రూ.4500 కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టారు. వైయస్‌ఆర్‌ బతికి ఉండి ఉంటే ఈ పాటికి పోలవరం ఫలితాలు అనుభవించేవారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ ఉత్పత్తి జరిగేది. రాష్ట్రం సుభిక్షంగా ఉండేది. దురదృష్టం దేవుడు ఆయన్ను మనకు దూరం చేశారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగింది.

రాష్ట్ర విభజన అనంతరం ఈ ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. దానికి అవసరమైన అన్ని ఖర్చులు కూడా కేంద్రమే భరిస్తుందని ఆ రోజు విభజన చట్టంలో పేర్కొంది. తదుపరి పరిణామాల్లో కొత్త రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 5 లక్షల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం, 2019లోనే పోలవరం పూర్తి చేస్తానని వాగ్ధానం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక 2014 జూన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్లలో పూర్తి చేస్తామన్నారు. 2016 సెప్టెంబర్‌ 7న పోలవరంను నిర్మించే బాధ్యతను రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్రం నుంచి తీసుకున్నారు. రెండేళ్ల కాలాన్ని వృథా చేసిన చంద్రబాబు ఆ తరువాత మేమే కడుతామని కాంట్రాక్టుల కోసం, కమీషన్ల కోసం కక్కుర్తి పడి పట్టుసీమను తీసుకొని వచ్చి కోటాను కోట్ల డబ్బులను కొల్లగొట్టారు.

హడావుడిగా పనులు మొదలుపెట్టి ప్రాజెక్టు వ్యయం రూ.16 వేల కోట్ల నుంచి రూ.55 వేల కోట్లకు పెంచారు. ఆ ప్రాజెక్టుకు రూ.16493 కోట్లు మాత్రమే అని  నిన్నటి రోజు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో శాసన సభ సాక్షిగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్‌ మంత్రి ఉత్తర కుమార ప్రగాల్భాలు పలికారు. 2019 నాటికి గ్రావిటీతో నీళ్లు ఇస్తామని ప్రకటన చేశారు. పోలవరంలో ఒక్క గేటు ఎత్తితే ఒక పెద్ద అట్టహాసం, కొత్త మిషన్‌ తీసుకువస్తే అట్టహాసంగా కార్యక్రమాలు చేశారు. నిన్నటి రోజు మళ్లీ పోలవరం వద్దకు వెళ్లి 2020 నాటికి గ్రావిటీతో నీళ్లు ఇవ్వడం అసాధ్యమని చెప్పారు. 40 రోజుల ఆలçస్యం కారణంగా నీళ్లు ఇవ్వలేకపోయామని చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు. కేంద్రం ఇందుకోసం రూ.6 వేల కోట్లు ఇచ్చింది. రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి 75 శాతం పనులు పూర్తి చేశామని చంద్రబాబు చెబుతున్నారు.

ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తావు. దొంగ లెక్కలతో దోపిడీ బయటకు రాకుండా చూస్తున్నారు. పోలవరం ఫలితాలు ఇంతవరకు అందకపోవడానికి చంద్రబాబు అసమర్ధతే కారణం. చంద్రబాబు అవినీతికి పోలవరాన్ని తాకట్టు పెట్టారు. పోలవరం కాంట్రాక్టు, కాసుల కక్కుర్తి కోసం కేంద్రానికి తాకట్టు పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచన విధానంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును సాధించాలని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తపన పడుతున్నారు. ఏపీ ప్రజల అశీస్సులతో 23వ తేదీ విజయం సాధించబోతున్నారు. ఆయన నేతృత్వంలో త్వరలోనే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. చంద్రబాబు అవినీతికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ..పోలవరాన్ని పూర్తి చేస్తాం. వైయస్‌ జగన్‌ అనుకున్న సమయంలో పోలవరాన్ని పూర్తి చేస్తారు. చంద్రబాబు దయచేసి నీ జిమ్ములు, మాయలు, మోసాలు ఇకనైనా ఆపండి. ఐదేళ్లు ప్రజలను మోసం చేశారు. ఇప్పటికైనా సరే మీ వయసుకు, మీ అనుభవంతో ప్రజలను మేలు చేసేందుకు ముందుకు రండి. వాస్తవ విషయాలు ప్రజలు తెలుసుకున్నారు. 

 

తాజా ఫోటోలు

Back to Top