తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డిని నియమించారు. అలాగే రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా జిన్నూరి రామారావు(బాబీ) (డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎంవీఎస్ నాగిరెడ్డి 2011 నుంచి ఇప్పటి వరకూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడిగా పని చేశారు. అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ (APSAM) వైస్ చైర్మన్ గా విధులు నిర్వర్తించారు.