చెప్పాడంటే.. చేస్తాడంతే..

అధికార‌మైనా..ప్రతిపక్షమైనా వైయ‌స్ జ‌గ‌న్‌ తీరు మారదంతే..

విజయనగరం జిల్లా :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాటిచ్చారంటే మ‌డ‌మ తిప్ప‌ర‌ని మ‌రోసారి రుజువైంది.  ఇచ్చిన హామీ మేరకు విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని డయోరియా బాధిత మృతుల 13 కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలను చెప్పున వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అందచేశారు.  
 
ఈ సంద‌ర్భంగా బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వ నేతల్లో ప్రజల పట్ల బాధ్యత లేదని విమ‌ర్శించారు. చంద్రబాబు సర్కార్‌ డయేరియా బాధితులను పట్టించుకోలేదన్నారు. డయేరియా మరణాలు ఎంతో బాధాకరమని చెప్పారు. డయేరియాతో మరణించడం బాధాకరం. ⁠అసెంబ్లీలో ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా సమాధానం చెప్పింది. ⁠ప్రభుత్వాన్ని ఎన్ని అడిగినా వాళ్లు సక్రమంగా సమాధానం చెప్పలేదు. సీఎం చంద్రబాబు.. ఎనిమిది మంది అని, డిప్యూటీ సీఎం పది మంది మృతి చెందారని చెప్పారు. ప్రభుత్వం ఒక్కరే అని చెప్పిందని మండిపడ్డారు.

గతంలో నేను ఎప్పుడూ విజయనగరంలో ఇంత మంది డయేరియాతో చనిపోవడం చూడలేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బాధ్యతగా వ్యవహరించడం లేదు. డయేరియా బాధితుల విషయంలో వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత ⁠వైయ‌స్ జగన్ వెంటనే స్పందించారు. ప్రజల పట్ల బాధ్యత వహించారు. బాధితులకు అండగా నిలిచారు. వైయ‌స్ఆర్‌సీపీ  తరఫున ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు ఆర్ధిక సాయం అందించారు. గుర్ల మండలానికి మేము వచ్చి చూసే వరకు ప్రభుత్వం బాధితులను పట్టించుకోలేదు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

అన్నట్టు ఇదే బాధితులకు లక్ష చొప్పున ఇస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు కదా ఆ హామీ ఏమైందని గ్రామస్థులు అడిగారు. కూట‌మి ప్రభుత్వం చేయలేని పని ఈ రోజు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జ‌గ‌న్ చేసి చూపించార‌ని,  పేద ప్రజలపై ఆయ‌న‌కు ఉన్న నిబద్ధతను ఈ సాయ‌మే చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ అని గ్రామ‌స్తులు పేర్కొంటున్నారు.

కార్యక్రమంలో పులిరాజు, ఎంపీపీ ప్రతినిథి పోట్నూరు సన్యాసినాయుడు, జడ్పీటీసీ సీర అప్పల నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు స్వామినాయుడు, బెల్లన బంగారు నాయుడు,మధు, త‌ద‌త‌రులు పాల్గొన్నారు. 

Back to Top