జాబ్ మేళాలో సౌకర్యాలు భేష్ 

ఉద్యోగార్దులు, తల్లిదండ్రులు సంతృప్తి 

 దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేక సహాయకులు 

 గుంటూరు: ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ఆదేశాల మేరకు వైయ‌స్సార్సీపీ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో నిర్వహించిన వైయ‌స్సార్ మెగా జాబ్‌ మేళాలో ఏర్పాట్లు, సౌకర్యాలపై ఉద్యోగార్ధులు, వారికి తోడుగా వచ్చిన  తల్లిదండ్రులు, సహాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్లలో భాగంగా భోజన సదుపాయంతోపాటు దారి పొడవునా మంచినీటి సరఫరా, ప్రత్యేకంగా ఆర్ ఓ కూలింగ్ వాటర్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అభ్యర్థులు జాబ్ మేళా నిర్వహించిన రెండు రోజులూ పెద్ద ఎత్తున యూనివర్శిటీకి పోటెత్తారు. ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశాల వద్ద ప్రత్యేకంగా టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు వివిధ కంపెనీలకు చెందిన సమాచారం, ఇంటర్వ్యూలు జరిగే ప్రదేశాలు గురించి సమాచారం అందించేందుకు సమాచార కేంద్రాలు, హెల్ప్ డెస్క్ లు, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా మంచినీరు, మజ్జిగ ప్యాకెట్ల కౌంటర్లు యూనివర్సిటీ ప్రధాన ద్వారం నుండి దారి పొడవునా అందించే ఏర్పాట్లు చేశారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా సహాయకులను ఏర్పాటు చేశారు. మరోవైపు కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుండి జాబ్ మేళాకు హాజరయ్యే ఉద్యోగార్ధులు యూనివర్శిటీకి చేరుకునేందుకు విజయవాడ, గుంటూరు మధ్య ప్రత్యేకంగా 60 ఆర్టీసీ బస్సులు నడిపారు. వేసవి దృష్ట్యా కొన్ని ఏసీ బస్సులు కూడా నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.  వివిధ ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సులు రోజుకు 300 ట్రిప్పులు తిరిగినట్లు మంగళగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్. ఎం. నాయక్ తెలిపారు. ప్రధమ చికిత్స కేంద్రాలు, అంబులెన్స్ లు ప్రాంగణంలో అందుబాటులో ఉంచారు. 800 మందికి పైగా వలంటీర్లు జాబ్ మేళాలో అభ్యర్దులకు వివిధ రకాల సేవలందించారు. మరోవైపు గుంటూరు జాబ్ మేళా ఇన్చార్జ్  హర్షవర్ధన్ రెడ్డి,  యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ ఏర్పాట్లు, వసతులను ప్రత్యేకంగా పర్యవేక్షించి, సిబ్బందికి వలంటీర్లకు ఎప్పటికప్పుడు తగిన  సూచనలు చేశారు.
*ఏర్పాట్లు పూర్తి సంతృప్తినిచ్చాయి*  దారిపొడవునా మంచినీరు, వేసవి దృష్ట్యా మజ్జిగ ప్యాకెట్ల సరఫరా, భోజనం ఏర్పాట్లు బాగున్నాయి. ఇన్ఫర్మేషన్ సెంటర్ల ఏర్పాటుతో ఉద్యోగార్దులు ఇంటర్వ్యూలు జరుగుతున్న ప్రదేశాలకు చేరుకోవడానికి మార్గం సలభతరం అయిందని తుళ్ళూరుకు చెందిన ఉద్యోగార్దులు ఎస్. శేషాద్రి, టి. జగదీష్ చెప్పారు. 
నా కుమార్తె పావని నాగలక్ష్మికి సహాయంగా ఇంటర్వ్యూకి వచ్చాను. ఇక్కడి ఏర్పాట్లు ఎంతో తృప్తినిచ్చాయి. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు పకడ్బందీగా  ఏర్పాట్లు చేశారు. శుభ్రమైన వాతావరణంలో రుచికరమైన భోజనం అందించారు. నా  కుమార్తె రెండు కంపెనీలకు   సెలెక్ట్ అయ్యింది. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గుంటూరుకు చెందిన అనిత‌ కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top