వైఎస్‌ గొంతుకలు

 

2004, ఎన్నికలు... వైఎస్సార్‌ ఒక గొంతుక. ఒకే ఒక గొంతుక.

వైఎస్‌ నడిచారు. నిలిచారు. గెలిచారు.

2019, ఎన్నికలు వైఎస్‌ మూడుగొంతుల స్వరం

నడిచి, నిలిచి, గెలిచే బాటలో వైఎస్‌ జగన్‌.

స్వరాలు కలుపుతున్న వై.యస్‌.విజయమ్మ, వై.యస్‌.షర్మిళ...

అవున్నిజం...వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డి వారికి పెద్దకుటుంబాన్ని ఇచ్చారు. వారిప్పుడు ప్రజాబంధువులు. ప్రజలకు ఆత్మీయబంధువులు. 

తొమ్మిదేళ్ల రాజకీయజీవితంలో నిరంతరం ప్రజల మధ్యనే సాగుతున్నారు వైఎస్‌జగన్‌. వారి సమస్యలపై స్పందించారు. పోరాటాలు చేశారు. దీక్షలు బూనారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా హృదాంతరాళం గర్జించారు. ప్రత్యేకహోదాపై పట్టిన పట్టు వీడలేదు. రాష్ట్రప్రజల కోసం అలుపెరుగని పోరాటం మానలేదు. అటు అసెంబ్లీలో, ఇటు ప్రజాక్షేత్రంలో జనం కోసం జగన్‌ గళం విప్పుతూనే వున్నారు. అధికారపక్షానికి చెమట్లు పట్టిస్తూనే వున్నారు. ప్రజలకోసం స్పందించడమెలాగో చేసి చూపుతూనే వున్నారు. వైఎస్‌ వీడని ప్రజాబాట. జగన్‌ నడుస్తున్న జనం బాట.

 

రాజన్న బిడ్డను...జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ...జగన్‌ కష్టకాలంలో నడిచింది వై.ఎస్‌.షర్మిళ. నాన్న ఆశయాల బాటలో...జగనన్న కోసం గుండెగొంతుకలొకటి చేసి మాట్లాడుతోంది. జగనన్నను గెలిపించుకుందాం...మంచి పాలన తెచ్చుకుందాం అంటూ ప్రజల మధ్య సాగుతోంది.

 

ఆ బిడ్డలకు తల్లి. ఆ రాజశేఖరుడి బాధ్యతలు మోస్తున్న అమ్మ. విజయమ్మ ఎన్నికల ప్రచారంలోకి వచ్చింది. రాజశేఖరరెడ్డి మీ గుండెల్లో వున్నాడు. జగన్‌ మీ ముందు వున్నాడు. మీ ప్రేమాభిమానాలే జగన్‌ను నడిపించాయి. మీకు మంచి చేయాలని తపిస్తున్నాడు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తండ్రిలానే మీకోసం పాటు పడతాడు. చెప్పినవన్నీ చేస్తాడు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడు. తండ్రిలానే నా బిడ్డ మాట తప్పడు, మడమ తిప్పడు అని ప్రజలకు చెబుతోంది వై.యస్‌.విజయమ్మ. 

 

జనం సాక్షిగా తల్లీ,బిడ్డలు. జనమే వారి నమ్మకం. జనమే వారి బలం. వారికోసం కదిలొస్తున్న జనసముద్రాలు. ప్రజల ముందు ఓ నమ్మకంలా...ఓ భరోసాలా ...ధైర్యంలా వారు...

మా నమ్మకం..మా భరోసా...మా ధైర్యం మీరేనంటున్న జనం...

2019 కొత్తవెలుగులతో వస్తోంది....కొత్త వెలుగులు తెస్తోంది.... 

 

 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top