బాబుకు బ్యాడ్ టైం

ఏపీలో చంద్ర‌బాబు అధికారం కోల్పోవ‌డం ఖాయ‌మ‌న్న ఎక‌నామిక్స్ టైమ్స్‌

చంద్ర‌బాబు పాల‌నా వైఫ‌ల్యాలే కార‌ణ‌మ‌ని విశ్లేష‌ణ‌

2004లో వైయ‌స్ఆర్ చేతిలో చంద్ర‌బాబు ఓట‌మి..

2019లో వైయ‌స్ జ‌గ‌న్ చేతిలో త‌ప్ప‌ని ప‌రాభ‌వం

వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కాబోతున్నారంటున్న జాతీయ ప‌త్రిక‌

అమ‌రావ‌తి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అన్ని దారులూ మూసుకుపోయాయని విశ్లేషించింది ప్రముఖ దినపత్రిక ‘ది ఎకనామిక్ టైమ్స్’. ఏపీ రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తూ ఆ పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది.

  • రాజకీయంగా పొరపాట్లు చేయడం చంద్రబాబు నాయుడుకు కొత్త ఏమీకాదని ఆ కథనంలో పేర్కొన్నారు. రెండువేల నాలుగులో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం బాబు చేసిన ఒక పెద్ద పొరపాటని, ఆయనకు ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశంపై క్లారిటీ ఉండదనేందుకు అదొక ఉదాహరణ అని అందులో విశ్లేషించారు.
  • అలా పదేళ్ల పాటు ప్రతిపక్షానికి పరిమితం అయిన బాబు గత ఎన్నికల్లో మోడీ, పవన్ కల్యాణ్ ల సహకారంతో వైఎస్ జగన్ కన్నా స్వల్పమైన ఎడ్జ్ తీసుకుని గెలిచారని పేర్కొన్నారు.
  • పవన్ కల్యాణ్ విషయంలో చంద్రబాబుది రాంగ్ స్ట్రాటజీ అని ఎకనామిక్ టైమ్స్ విశ్లేషించింది. పవన్ కల్యాణ్ పార్టీ సొంతంగా వెళ్లి ప్రజావ్యతిరేక ఓటును చీల్చుతుంది, తద్వారా తను బయటపడొచ్చు అని బాబు అనుకున్నారని, అందుకే పవన్ పార్టీని సొంతంగా పోటీ చేయించారని.. ఇదంతా బాబు వ్యూహం అని ఆ పత్రిక పేర్కొంది.
  • అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో చంద్రబాబు నాయుడుది రాంగ్ స్ట్రాటజీ అని విశ్లేషించింది. యాంటీ మోడీ వేవ్ బలంగా ఉందని బాబు అనుకోవడం కూడా భ్రమ అని, మోడీని, కేసీఆర్ ను తిడుతూ ఎన్నికల్లో గెలవాలని అనుకోవడం ఆయన మిస్టేక్ అని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.
  • ఐదేళ్ల చంద్రబాబు పాలనే ఇప్పుడు అయనకు అన్ని రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలేలా చేస్తోందని ఈ పత్రిక విశ్లేషించింది.
  • క్యాస్ట్, కరప్షన్, క్రైమ్.. ఈ మూడూ గత ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలోని ప్రధానమైన ఫీచర్లు అని ఎకనామిక్ టైమ్స్ పేర్కొనడం గమనార్హం.
  • కేసీఆర్ తో జగన్ జతకట్టాడు, మోడీతో జగన్ జతకట్టాడు అని బాబు చేస్తున్న ప్రచారాన్ని ఆ కథనంలో ప్రస్తావించారు. కేసీఆర్ ఆల్రెడీ ఘన విజయం సాధించారు. మోడీనే మళ్లీ గెలిచేలా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారితో జగన్ కు ముడిపెట్టడం ద్వారా.. జగన్ కూడా గెలవడం ఖాయమనే అభిప్రాయాన్ని చంద్రబాబే కలిగిస్తున్నారని విశ్లేషించింది.
  • ఏతావాతా మే ఇరవైమూడున వచ్చే ఫలితాల్లో తెలుగుదేశం చిత్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, అంతటితో చంద్రబాబుకు రిటైర్మెంటే అని ‘ది ఎకనామిక్ టైమ్స్’ పేర్కొంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top