జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి

 తణుకు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌గ‌తి ర‌థ‌సార‌ధి.. చంద్ర‌బాబు రియ‌ల్ట‌ర్ల‌కు వార‌ధి అంటూ వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు నిన‌దించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. తణుకు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ గో బ్యాక్ ఫేక్ యాత్రికులారా అంటూ వివిధ నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అమరావతి పేరుతో టీడీపీ, చంద్రబాబు అండ్‌ కో చేస్తున్న కుతంత్రాలపై ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేశారు. తణుకు నియోజకవర్గంలోని పోస్టర్లలో నినాదాలు ఇలా ఉన్నాయి.. 

 
► రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్రాస్టేట్ ముద్దు  

► జగన్ ది స్టేట్ గురించి ఆలోచన.. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ గురించి ఆలోచన

► జగన్ కోరుకొనేది అందరి అభివృద్ధి.. చంద్రబాబు కోరుకునేది అస్మదీయుల అభివృద్ధి

► జగన్ ది సమైక్యవాదం.. చంద్రబాబుది భ్రమరావతి నినాదం

► జగన్ ది అభివృద్ధి మంత్రం.. చంద్రబాబు ది రాజకీయ కుతంత్రం

► రాష్ట్రం కోసం జగన్ ఆరాటం.. 29 గ్రామాల కోసం బాబు నకిలీ పోరాటం

► మూడు రాజధానులకు ప్రజా ఆమోదం.. చంద్రబాబు అండ్ కో రియల్టర్లకు ఖేదం

► చంద్రబాబు పార్టీ షేక్ పాదయాత్ర ఫేక్

► అన్ని ప్రాంతాల అభివృద్ధి జగనన్న ఆకాంక్ష.. అయిన వారు బాగు కోసమే వికేంద్రీకరణకు బాబు వివక్ష

► వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య వివక్ష వద్దు

► హైదరాబాద్ ప్రయోగం అన్యుల పాలు.. అమరావతి ప్రయోగం చంద్రబాబు అండ్ కోకే మేలు

తాజా వీడియోలు

Back to Top