పచ్చి అబద్ధాలకు పరాకాష్ట ఈ వార్తలు..

ఏది రాసినా చదివేస్తారులే...నమ్మేస్తారులే...ప్రజలంటే గొర్రెలే అనేది రామోజీ, రాధాకృష్ణ, ఇతర పచ్చ పత్రికల పక్కా అభిప్రాయం.
అందుకే వాస్తవాలను వక్రీకరించినా, అడ్డగోలు అబద్ధాలు రాసినా వాళ్లకి చెల్లిపోతోంది.
ఇలాంటి గుడ్డకాల్చి మీదవేసే విధానానికి స్వస్తిపలకమని, వాస్తవాలు వివరంగా రాయమని అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు పదే పదే ఈ పత్రికలు విజ్ఞప్తి చేసారు. 
కానీ వీళ్ల పంథా మారదు. 
అధికారంలో ఉన్నది చంద్రబాబు కాకపోతే ఇక కుట్రల భాగోతాలకు తెరతీస్తారు. 
ఒకప్పుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు రామోజీ ఈనాడును కరపత్రికలా వాడుకున్నాడు
నేడు చంద్రబాబు అధికారం పోయాక కూడా అలాగే ఉపయోగపడుతున్నాడు. 
23వ తేదీ ఈనాడు పత్రికలో వచ్చిన బ్యానర్ కథనం చూడండి. 
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేంద్ర హోం శాఖా మంత్రిని కలిసి ఏ విషయాలపై చర్చించారో, ఎంత సేపు మాట్లాడారో, ఏ అంశాలపై లేఖలిచ్చారో వివరంగా రాసింది ఈనాడు.
ఇదే ఈనాడు ఇవాళ్టి కథనం హెడ్ లైన్సు చూడండి...
సుజనా చౌదరి చెప్పినట్టుగా ఇచ్చిన ఈ కథనంలో సబ్ హెడ్డింగ్స్ లో సీఎం జగన్ గారు హోం మంత్రికి శుభాకాంక్షలు తప్ప మరేం చెప్పలేదని రాసింది.
అంటే రెండ్రోజుల క్రితం ఈనాడు రాసిన వార్తలన్నీ అబద్ధాలా? లేక నేడు సుజనా చౌదరి చెబుతున్న మాటలు అబద్ధాలా?
ఏపీ సిఎం కు అమిత్‌ షాకు మధ్య చర్చలేం జరగలేదని సుజనా చౌదరి అన్నట్టు ఇచ్చిన ఈ కథనంలో లోపల మాత్రం వినతి పత్రం ఇచ్చినట్టు రాసుంది. అందులో డిమాండ్లన్నీ తీర్చదగ్గవి కాదని సుజనా స్పష్టం చేసాడట. 
విభజన హామీల విషయంలో లేఖలు ఇచ్చినట్టు ఓ పక్కన ఒప్పుకుంటూనే అమిత్ షా తో చర్చలే జరగలేదని కారుకూతలు ఎలా కూస్తారు?
అన్న సుజనా చౌదరికి బుద్ధి బురదగుంటలోకి పోతే రాసే ఈనాడుకు ఆ సెన్సు ఎందుకు కరువైంది?
కనీసం సుజనా ప్రెస్ మీట్లో అయినా 'సీఎం 45 నిమిషాల భేటీ' గురించి రాసిన ఈనాడు విలేఖరులు ఈ ప్రశ్నలెందుకు అడగలేకపోయారు?
అయినా బీజేపీ కండువా కప్పుకున్న టీడీపీ వీరవిధేయ సుజనా చౌదరికి ఏపీ డిమాండ్లు నిర్హేతుకం అనే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది?
ప్రధాని మోదీ చెప్పారా? లేక అమిత్‌ షా చెప్పమన్నారా? లేదా చంద్రబాబు ఇలా ప్రచారం చేయమని కబురు పంపారా?
పచ్చమీడియా కక్కుతున్న అబద్ధాల విషాన్ని ప్రజల ముందు బట్టబయలు చేసేందుకే ముఖ్యమంత్రి వైయస్ జగన్ తప్పుడు వార్తల విషయంలో చర్యలు తీసుకోమని కార్యదర్శులకు అధికారం ఇచ్చారు. 
నిజంగా అవినీతి జరిగితే ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకుంటుంది...కానీ అబద్ధాలను ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే దురుద్దేశ్యంతో కుట్రపూరిత అసత్య కథనాలు వండి వారిస్తే మాత్రం ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
అలాగే వాస్తవాలను మరుగు పరిచి, ఇలాంటి చౌకబారు రాతలు రాసినంత మాత్రాన ప్రజలు వెర్రిగా నమ్ముతారని భ్రమపడరాదు. 2019 ఎన్నికల ఫలితాలు బాబుకు బాకాలూదిన ఎల్లో మీడియాకు కరెంటు షాకుల్లాంటివి…
జర్నలిజాన్ని ఎర్నలిజంగా, ఎల్లో ఇజంగా మార్చిన పచ్చ మీడియాకు ఎర్రని హిట్ లాంటిది వైసీపీ సోషల్ మీడియా.
ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయబోయినప్పుడల్లా వాస్తవాలను అది ప్రజల ముందుంచుతూనే ఉంటుంది...

Read Also: ఉద్యోగం, ఉపాధి అంశాలపై సీఎం కీలక నిర్ణయాలు

Back to Top