ఆపరేషన్‌ ‘సెకండ్‌ క్లాస్‌’

వైయస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకులే టీడీపీ టార్గెట్‌

ఎన్నికలప్పుడు దెబ్బతీయాలని బాబు వ్యూహం

నియోజకవర్గాల వారీగా నాయకులు వివరాలు సేకరణ

వారితో నిత్యం టచ్‌లో ఉంటున్న టీడీపీ నాయకులు

ఆర్థిక అవసరాలు తీరుస్తూ వారికి సహకారం

ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. చంద్రబాబు కుఠిల ప్రయోగాలతో మరోసారి గద్దెనక్కాలని చూస్తున్నాడు. పాత ఫార్ములాకు దుమ్ముదులికి కొత్తగా ప్రయోగించాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. వైఎస్సార్‌సీపీలో ఉన్న అసంతృప్త నాయకులను లాగడం ద్వారా మీడియా ఇచ్చుకుని తద్వారా ఆ పార్టీని దెబ్బకొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. జగన్‌ టికెట్‌ నిరాకరించిన నేతలను వల పన్ని పట్టుకుంటున్నాడు.  23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు... వారికి టికెట్‌ హామీ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా వెల్లువెత్తే వ్యతిరేకతను చల్లార్చుకునేందుకు.. వైయస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు గాలం వేసి పార్టీలో చేర్చుకుంటున్నాడు.

సులభంగా బుట్టలో పడే వారి వివరాలు సేకరించి సందర్భం చూసి టీడీపీలో చేరికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నాడు. కళ్లు చెదిరే ఆఫర్లు ఇచ్చి పార్టీలో స్థానం కల్పిస్తాడు. డబ్బు ఎంతయినా పంచడానికి సిద్ధం. ఆర్థిక సమస్యలు ఉంటే వెంటనే వాలిపోతారు. ప్రతి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకులే లక్ష్యంగా లిస్టు తయారు చేస్తారు. టీడీపీలోని ఒక విభాగం నిత్యం వారితో టచ్‌లో ఉంటుంది. వారికి ఆర్థిక అవసరాలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంది. అయితే పార్టీలో చేరబోయే సదరు నాయకులకు కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. ఆ నాయకులు ఎవరూ టికెట్‌ ఆశించకూడదు. వారు కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేయాలి. కనీసం నోటితో విరుచుకుపడిపోయే లక్షణం ఉండాలి. అబద్ధాలు చెప్పయినా జనాన్ని నమ్మించే తెలివితేటలుండాలి. లేదా ఆయా నియోజకవర్గాల్లో సదరు వ్యక్తి కులం వారు అధికంగా ఉండాలి. లేదా బంధుగణం ఎక్కువగా ఉండాలి. ఎన్నికల సమయంలో పోరు ముఖాముఖి ఉన్నప్పుడో.. టీడీపీ అభ్యర్థి కొద్ది ఓట్లు తేడాలో గెలుపుకు దూరంగా ఉన్నప్పుడు వీరిని అకస్మాత్తుగా పార్టీలో చేర్చుకుంటారు. అప్పటివరకు ఉన్న అభ్యర్థికి వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. ఆ ఆరోపణలు కూడా ఎలాగుండాలంటే.. సదరు ఆరోపణలు ఎదుర్కొనే వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థికి నిరూపణ చేసుకునేందుకు సమయం దొరక కూడదు. 

Back to Top