జగన్‌...జనం...ప్రజాసంకల్పం

 పండగరోజు బంధువుల్ని పలకరించడం సంతోషమే. కానీ గొప్పేమీ కాదు. కష్టకాలంలో నేనున్నానని పలకరించేవాడే ఆత్మబంధువు. ’’ప్రజలు కష్టాల్లో వున్నప్పుడే వారి చెంతకు వెళ్లాలి. వారికి భరోసా నివ్వాలి. ధైర్యాన్ని నూరిపోయాలి. భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలి’’ ఇది వైయస్సార్‌ ఆశయం. అవకాశం వస్తే, ప్రజలకు చెప్పినవన్నీ చేసి చూపించాలన్నది మహానేత ఆదర్శం. వైయస్సార్‌ ఆశయం, ఆదర్శాల బాటలోనే రాజన్న బిడ్డ చారిత్రాత్మక పాదయాత్ర పూర్తి చేశారు. జగన్‌ ప్రజాసంకల్పం బలమైంది. విశ్వసనీయమైనది అనడానికి ఆయనతో అడుగులో అడుగులేస్తూ నడిచిన జనం..జనం...వేలు లక్షలు. కోట్లకు చేరిన జనకడలి తరంగం.

వైయస్‌ పాదయాత్ర రోజుల్లో ప్రజల కష్టాలెలా వున్నాయో...జగన్‌ పాదయాత్రలోనూ అవే కష్టాలు. ఆ మాట కొస్తే ...వైయస్‌ హయాంలో సస్యశ్యామలమైన రాష్ట్రం...బాబుపాలనలో మళ్లీ కరువును చూసింది. అతివృష్టి, అనావృష్టిల బారిన పడింది. ప్రకృతి విపత్తుల కన్నా, పాలకుల నిర్లక్ష్యం ప్రజాజీవితాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేసింది. 

అంతబాగుందనుకున్నప్పుడు, ఎన్నికల దగ్గరపడ్డప్పుడంటూ మీనమీషాలు లెక్కపెట్టుకోకుండా, జగన్‌ పాదయాత్రను సంకల్పించారు. అసెంబ్లీలో ఎలాగూ ప్రజాస్వామ్యం లేదు,ప్రజల మధ్యనుంచే పాలకులను నిలదీసే మార్గం ఎంచుకున్నారు. లోకమాన్య బాలగంగాధర్‌ ఒకచోట ఇలా అంటారు. ’అంతా సవ్యంగా వున్నప్పుడు నడుస్తాననుకోవడం అజ్ఞానమే. సంకల్పించిన మంచిని సాధించడానికి కనిపించిన బాటెంబడి నడక మొదలుపెట్టేయాలి’ అని వై.యస్‌.ప్రజాప్రస్థానం రోజుల్లోనైనా, జగన్‌ ప్రజాసంకల్పయాత్రలోనైనా ప్రతిఫలించేది అదే. ప్రజల కోసం ...ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం కోసం ఆ తండ్రీకొడుకులు జనం బాట పడ్డారు. మండుటెండా కాలమైనా మరో ఆలోచనంటూ లేకుండా వైయస్‌ జనం చెంతకు వెళ్లారు. మండేకాలం, వర్షాకాలం, వణికించే చలికాలం ...ఓ వైపు రుతువులు మారిపోతున్నా...పద్నాలుగు నెలల పాటు జగన్‌ జనం బాటే నడిచారు.

నిజంగా చెప్పాలంటే...జగన్‌ పాదయాత్ర ఊహించనంతగా విజయవంతమైంది. కలలోనైనా మరొకరికి సాధ్యమా? అన్న రీతిలో సక్సెస్‌ అయింది. ఊరూవాడా, పల్లె పట్నం తేడా లేకుండా యువనేతకోసం నదీ ప్రవాహాల్లా.... జనం ఉప్పొంగిపరవళ్లు తొక్కారు. పాదయాత్ర మొదట్లో విమర్శలు చెలరేగినా, ప్రత్యర్థులు పిల్లిశాపనార్ధాలు పెట్టినా, విదూషకుల్లా ఎకసెక్కాలాడినా...

పాదయాత్ర సంకల్పం రోజు రోజుకూ బలపడుతూనే పోయింది. 

కడపలోని ఇడుపుల పాయలో మొదలైన పాదయాత్ర...ఇచ్ఛాపురం దాకా ఒక జైత్రయాత్రలా సాగింది. జగన్‌లోని వ్యక్తిత్వం వెలుగులు ప్రజలందరికీ అర్థమయ్యాయి. అతనిలో ఓ అన్నను, మనవడిని, బిడ్డను, మామయ్యను ఇలా ఎవరికి వారు...ఆత్మీయతల కొద్దీ ...అతనిలో బంధువునెలా చూసుకున్నారో...మరోవైపు జగన్‌ ఓ దార్శనికుడైన రాజకీయవేత్తగా తనను తాను ఆవిష్కరించుకున్నాడు. ప్రజలకు తను అర్థమయ్యాడు. ప్రజలనూ అతను సంపూర్తిగా అర్థం చేసుకున్నాడు. దేశ రాజకీయ చరిత్రలోనూ వినూత్నమై, విప్లవాత్మకమైన పాదయాత్ర 3648 కిలోమీటర్ల సుదూరాన్ని దాటేసింది. ఎన్నెన్నో మైలురాళ్లను దాటేసింది. కోట్లాది జనం గుండెల్లో చోటుసాధించుకుంది. నేడు, రేపు, రాబోయే రోజుల్లో ఎడుగూరి సందింటి వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర ప్రభావం అన్నింటీ మీదా వుంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రరాష్ట్రప్రజల సంక్షేమం విషయంలో, రాష్ట్ర అభివృద్ది విషయంలో విలువైన దారిగా చరిత్రలో నిలిచిపోతుంది. 

 

’’హిమసుందర శృంగమైన ఎవరెస్ట్‌ను ఒక టెన్సింగే ఎక్కగలడు

 సుమసుందర వసంతగీతంలో ఉగాదిని ఆహ్వానించగలడు’’

 

’’కాలం సవాల్‌ వంటిది

సాహసవంతు డందుకొనిముందు సాగిపోతాడు’’

ప్రజల కోసం...ప్రజలందరి కోసం 

 

 

Back to Top