మహానేతపై ఎనలేని అభిమానం

సంక్రాంతి సందర్భంగా డా. వైయస్ రాజశేఖరరెడ్డికి వై. వాసు నాయుడు ప్రత్యేక నివాళులు

రాజన్న చిత్రపటానికి ప్రతి ఏటా నూతన వస్త్రాల బహూకరణ

విజయనగరం జిల్లా: శత్రువుకైనా చేయూతనిచ్చే విశాల హృదయం కలిగిన మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖరరెడ్డి అని విజయనగరం జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు వై. వాసు నాయుడు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాజాం అసెంబ్లీ పరిధిలోని వంగర మండలం, ఋషింగి గ్రామంలో తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నూతన వస్త్రాలు బహూకరించి ఘనంగా నివాళులు అర్పించారు. “పెద్దాయన… నిన్ను మరువం. నీ చిరునవ్వు మా గుండెల్లో పదిలంగా ఉంది. నువ్వు చూపిన బాటలోనే మా పయనం. మీ ఆశయ సాధనకే మా జీవితం” అంటూ భావోద్వేగంతో రాజన్నను స్మరించుకున్నారు వాసు నాయుడు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదీ కూడా తమ కుటుంబ పెద్దలతో కలిసి దివంగత మహానేతకు నూతన వస్త్రాలు చూపించి సంక్రాంతి పండుగ జరుపుకున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మా ఆరాధ్య నాయకుడు, రైతు బాంధవుడు డా. వైయస్ రాజశేఖరరెడ్డి గారిని కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి పండుగకు ఆయనను స్మరించుకోవడం మా సంప్రదాయం. జోహార్ వైయస్‌ఆర్… జోహార్ పెద్దాయన… వైయస్‌ఆర్ ఫరెవర్” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

రైతులు పండించే ధాన్యాలు, కూరగాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తులను స్వయంగా సేకరించి, కుటుంబ పెద్దలతో పాటు దివంగత డా. వైయస్ రాజశేఖరరెడ్డి గారికి భోజిలు (నైవేద్యం) సమర్పించడం, అనంతరం బ్రాహ్మణునికి నూతన వస్త్రాలు అందించడం తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయమని వివరించారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా రాజన్నపై ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమని తెలిపారు.

“మా శ్వాస ఉన్నంతవరకూ నిన్ను స్మరిస్తూనే ఉంటాం రాజన్న. నీ అభిమానులుగా ఉండటం మా గర్వకారణం. వచ్చే జన్మలో కూడా నీ అభిమానులుగానే పుట్టాలని, మా నాయకులు జగన్ అన్నకు సైనికులుగా ఉండాలని దేవుణ్ణి మనసా–వాచా–కర్మణా ప్రార్థిస్తున్నాం” అని వాసు నాయుడు అన్నారు.

ఋషింగి గ్రామంలో జరిగిన ఈ సంక్రాంతి వేడుకలు రాజకీయ కార్యక్రమంలా కాకుండా, ఒక కుటుంబ సభ్యుడిని స్మరించుకునే ఆత్మీయ వాతావరణంలో సాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Back to Top