అమరావతి: పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు తోడుగా ఉంటానని మాట ఇచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. ముఖ్యమంత్రి అయ్యాక ఈ రెండున్నరేళ్లలో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేశారు. రెండేళ్లు వరుసగా కోవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినా లెక్క చేయకుండా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి. కరోనా నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నలకు పెట్టుబడి కోసం మొన్ననే వరుసగా మూడో ఏడాది మొదటి విడత రైతు భరోసా సాయంగా 52.38 లక్షల మందికి రూ.3,928 కోట్లు జగనన్న ప్రభుత్వం అందించింది. రైతన్నకు మరింత మేలు జరగాలని పెట్టుబడి సమయానికే సాయం అంతదాలన్న మంచి ఉద్దేశంతో మరో రూ.1,820.23 కోట్లును ఖరీఫ్ 2020 ఉచిత పంటలను బీమా క్లెయిమ్‌గా 15.15 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో జగనన్న ప్రభుత్వం జమ చేసింది రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా ... వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్–2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్లు జమ చేసింది. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో నోటిఫైడ్ పంటలకు ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే బీమా వర్తింపచేసేవారు. దీంతో ఆర్థిక స్తోమత, అవగాహన లేక లక్షలాది మంది రైతులు బీమా చేయించుకోలేక ఆర్థికంగా నష్టపోయేవారు. పైగా బీమా సొమ్ములు ఎప్పుడొస్తాయో.. ఎంతొస్తాయో, ఎంతమందికి వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. ఈ దుస్థితికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై పైసా భారం పడనీయకుండా.. తానే భారాన్ని భరిస్తూ ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఏడాది తిరగకుండానే ఠంచనుగా పంటల బీమా సొమ్ములు చెల్లించాలన్న లక్ష్యంతో ఖరీఫ్– 2019 సీజన్‌కు సంబంధించి 9.79 లక్షల మంది రైతులకు రూ.1,252.18 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం 5.58 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.715.84 కోట్ల బకాయిలను కూడా చెల్లించి వారికి అండగా నిలిచింది. 2019–20లో 45.96 లక్షల హెక్టార్లకు బీమా 2019–20 సీజన్ (ఖరీఫ్, రబీ కలిపి)లో 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం బీమా చేయించింది. ఇందుకు రైతులపై పైసా కూడా ఆర్థికభారం పడనీయలేదు. టీడీపీ హయాంలో రబీ, ఖరీఫ్ కలిపి సగటున కేవలం 23.57 లక్షల హెక్టార్లు మాత్రమే బీమా పరిధిలోకి వస్తే ప్రస్తుతం 45.96 లక్షల హెక్టార్లు అంటే.. కోటి 14 లక్షల ఎకరాలను ప్రభుత్వం బీమా పరిధిలోకి తెచ్చింది. ఇందుకు రైతుల వాటా రూ.468 కోట్లు, ప్రభుత్వ వాటా రూ.503 కోట్లు కలిపి మొత్తం రూ.971 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. గత రెండేళ్లలో రూ.3,788.25 కోట్ల లబ్ధి ఖరీఫ్–2020 సీజన్‌లో 37.25 లక్షల మంది రైతులు 35.75 లక్షల హెక్టార్లలో వేసిన పంటలు బీమా పరిధిలోకి వచ్చాయి. దిగుబడి ఆధారంగా 21 పంటలకు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా 9 పంటలకు బీమా సదుపాయం కల్పించారు. పంటకోత ప్రయోగాల ఆధారంగా అర్హత పొందిన 15.15 లక్షల మంది రైతులకు రూ.1,820.23 కోట్లు బీమా సొమ్మును వారి ఖాతాల్లో మంగళవారం జమ చేస్తున్నారు. ఈ మొత్తంతో కలిపి గత రెండేళ్లలో పంటల బీమా కింద 30.52 లక్షల మంది రైతులకు రూ.3,788.25 కోట్ల లబ్ధిని వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేకూర్చింది. ఇలా ఇప్పటివరకు రైతులు వివిధ పథకాల కింద గత రెండేళ్లలో రూ.83,085.45 కోట్ల లబ్ధిని పొందారు. ఇచ్చిన మాటకు కట్టుబడి .. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. 5.58 లక్షల మంది రైతులకు గత టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ.716 కోట్ల బకాయిలను కూడా చెల్లించాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఏడాది తిరగకుండానే ఖరీఫ్–19లో 9.79 లక్షల మందికి రూ.1,252 కోట్లు అందించాం. ఖరీఫ్–2020లో అర్హత పొందిన 15.15 లక్షల మందికి రూ.1,820 కోట్లు జమ చేశారు. జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు రైతన్నలకు అందించిన సాయం వైఎస్ఆర్ రైతు భరోసా 5238 లక్షల మంది రైతులు సాయం రూ.17,029.88 కోట్లు వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు (గత ప్రభుత్వం బకాయిలతో సహా) 67.50లక్షల మంది రైతులకు.. సాయం రూ.11261.00 కోట్లు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా 30.82 లక్షల మంది రైతులకు సాయం రూ.3,788.25 కోట్లు ప్రకృతి విపత్తలు వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం 13.56 లక్షల మంది రైతులకు సాయం రూ.1,038.46 కోట్లు ధాన్యం కొనుగోలు ఇప్పటి వరకు రూ.30,405.62 కోట్లు ఇతర పంటల కొనుగోలు రూ.5,964 కోట్లు ఉచిత వ్యవసాయ సబ్సిడీ రూ.17,430 కోట్లు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకు ఫీడర్ల ప సామర్ధ్యం పెంపు రూ.1700 కోట్లు గత ప్రభుత్వం చెల్లించాల్సిన ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు గత ప్రభుత్వం చెల్లించాల్సిన విత్తన బకాయిలు రూ.384 కోట్లు శనగ రైతులకు బోనస్ రూ.300 కోట్లు సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి 13.58 లక్షల మంది రైతులకు రూ.1264.24 కోట్లు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ రూ.1560 కోట్లు రైతన్నల కోసం జగనన్న ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా 10,778 వైఎస్ఆర్ రైతు భరోసాకేంద్రాలు ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లు రూ.2వేల కోట్లతో విపత్తు సహాయ నిధి ఆక్వా రైతులకు యూనిట్ కరెంట్ కేవలం రూ.1.50లకే రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడంలో భాగంగా 2019-20, 2020-21 సంవత్సరాలకు గాను నేటి వరకు రూ.30,405.62 కోట్లతో 1,73,54,592 మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి రూ.5,964 కోట్లతో 16,46,303 మెట్రిక్ టన్నుల ఇతర పంటల ఉత్పత్తులకు మొత్తంగా 1,90,00,895 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులకు రూ.36,369.62 కోట్లతో గిట్టుబాట ధర కల్పించడం జరిగింది.