ఇసుక కుంభకోణంలో 'పచ్చకప్ప' ఎవరు?

ఏపీలో ఇసుక కొరతపై చంద్రబాబు చేస్తున్న రాజకీయ నీచ క్రీడ బట్టబయలైంది. ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. పనిలేక భవన నిర్మాణ రంగ కార్మికులు కష్టాలు పడుతున్నారు. అయితే వరదల వల్ల, నదుల నుంచి ఇసుక తేవడం కష్టమైపోతోందని ప్రభుత్వం చెబుతోంది. అయినా వీలున్న చోటల్లా తిప్పలు పడి ఇసుక రీచ్ లను నిర్వహించింది. వేల టన్నుల నుంచి లక్షల టన్నులు సరఫరా చేస్తున్నా సరే కొరత ఉండటంపై ప్రభుత్వానికి అనుమానం కలిగింది. ఆన్‌ లైన్ ఇసుక పోర్టల్ లో ఎప్పుడు చూసినా నో స్టాక్ బోర్డ్ ఉందనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ఆరా తీసారు. తీగ లాగితే చంద్రబాబు చేస్తున్న నీచమైన పనుల డొంక కదిలింది. కొదరు కేటుగాళ్లు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నట్టు ప్రాధమిక విచారణలో తేలింది. ఇందుకు వేదికగా పని చేస్తున్నది బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ అనే సంస్థ. ఇక్కడ నుంచే శాండ్ వెబ్‌ సైట్ హ్యాక్ చేసి ఇసుక కృత్రిమ కొరత సృష్టించినట్టు వెల్లడైంది.
బాబునోట కృత్రిమ కొరత మాట
ఇంతకాలంగా చంద్రబాబు, బాబు పార్టనర్ పవన్ కళ్యాణ్ లిద్దరూ కృత్రిమ కొరత కృత్రిమ కొరత అంటూ ఆరోపణలు చేయడం వెనుక రహస్యం ఇదే. ఐటీ గ్రిడ్ కుంభకోణంలో దొంగిలించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాను వాడుతూ ఇసుకను అక్రమంగా దోపిడీ చేసారు. కృత్రిమ కొరత వీళ్లు సృష్టించిందే కనుక దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా ప్రచారం చేస్తున్నారు. ఐటీ గ్రిడ్ ద్వారా ఓటర్ల లిస్టు గల్లంతు చేసిన దొంగ కంపెనీకి ఆ లిస్టు అందించింది ఈ బ్లూ ఫ్రాగ్ సంస్థే. ఇవి లోకేష్ బినామీ కంపెనీలని కూడా ఆరోపణలున్నాయి. తమకు ఓటు వేయనందుకు చంద్రబాబు ప్రజల మీద ఈ విధంగా పగ తీర్చుకుంటున్నాడంటున్నారు. 
బ్లూ ఫ్రాగ్ లో ఏం జరుగుతోంది?
ఏపీలో కొత్త ఇసుక విధానానాన్ని అమల్లోకి తెచ్చినప్పుడే మన శాండ్ పోర్టల్ ప్రారంభించారు సీఎం వైయస్ జగన్. దాని ద్వారా ప్రజలు ఆన్‌లైన్‌లో ఇసుక కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఉంది. ఆ పోర్టల్‌ను బ్లా ఫ్రాగ్స్ సంస్థే నిర్వహిస్తోంది. బ్లూ ఫ్రాగ్‌ సంస్థ‌కు చెందిన పలువురు వ్యక్తులు సైట్‌ను హ్యాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించినట్లు సీఐడీకి ఫిర్యాదు అందాయి. దాంతో రంగంలోకి దిగిన సీఐడీ విశాఖలో ఉన్న బ్లూ ఫ్రాగ్స్ కార్యాలయంలో సోదాలు చేసింది. స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. సర్వర్‌ని హ్యాక్ చేసి కోడ్ ద్వారా ఇసుక అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. కంపెనీ సర్వర్లలో డేటాను తనిఖీ చేసి పలు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంత ఇసుకను బ్లాక్ చేశారు? ఎవరికి ఆర్థిక ప్రయోజనాలు అందాయి? ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లింది? అనే దానిపై ఆరా తీస్తోంది. దీని  వెనక ఎవరున్నారని తేల్చే పనిలో ఉంది సీఐడీ. కాగా, ఏపీలో ఇసుక రవాణాలో అక్రమాలకు పాల్పడితే రూ. 2 లక్షల జరిమానాతో రెండేళ్ల జైలు విధించాలని ఇవాళ కేబినెట్ నిర్ణయించింది. 

Read Also: ఇంగ్లిష్‌ మీడియం చరిత్రాత్మక నిర్ణయం

తాజా వీడియోలు

Back to Top