చిరు వ్యాపారుల‌ను ర‌క్షించేందుకు  'జగనన్న తోడు'

నేడు లబ్ధి దారుల ఖాతాల్లో వడ్డీ జమచేయనున్న సీఎం వైయ‌స్ జగన్‌
 

తాడేపల్లి:వ‌డ్డీ వ్యాపారుల ఆగ‌డాల నుంచి చిరు వ్యాపారుల‌ను ర‌క్షించేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చేప‌ట్టిన వినూత్న కార్య‌క్ర‌మం జ‌గ‌న‌న్న తోడు.  'జగనన్న తోడు' కార్యక్రమంలో భాగంగా లబ్ధి దారుల వడ్డీ సొమ్మును బ్యాంక్‌ ఖాతాల్లో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేయనున్నారు. బుధవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేస్తారు. మొదటి విడత జగనన్న తోడు కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన (సెప్టెంబర్ 30లోగా) 4.5 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ది చేకూరనుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 9.05 లక్షల మందికి రూ. 950 కోట్ల రుణాలను అందించింది.

చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. ఈ పథకం కింద ప్రతి ఒక్కరికి ఏటా రూ.10వేల వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి లభించునుంది. అయితే తీసుకున్న రుణం చెల్లిస్తేనే తిరిగి రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top