చంద్ర‌బాబు @ వంద త‌ప్పులు

2014 ఎన్నిక‌ల్లో 600పైగా హామీలు

ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌మ‌ని కోరితే బెదిరింపులు

పార్టీ ఫిరాయింపుల‌తో ప్రజాస్వామ్యానికి తూట్లు

ఇన్ని త‌ప్పులు చేసిన నిన్ను న‌మ్మం బాబు

చంద్ర‌బాబుకు ఇక రాజ‌కీయ నిష్క్ర‌మ‌ణే

 

అమ‌రావతి: ప‌్ర‌జలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.లక్షల కోట్లు వేనకేసుకుంటున్న చంద్రబాబు ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెర‌వేర్చ‌లేదు. ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌మ‌ని కోరితే ఎదురు దాడికి దిగ‌డం, బెదిరించ‌డం ఆయ‌న‌కు బాగా అల‌వాటైంది. చేసిన త‌ప్పుల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు ఆ నెపాన్ని వేరే వారిపై నెట్ట‌డం బాబుకు వెన్న‌తో పెట్టిన విద్య‌. నాలుగేళ్లు బీజేపీతో క‌లిసి కాపురం చేసిన బాబు..ఏడాదిలో ఎన్నిక‌లున్నాయి ఆ పార్టీతో విడాకులు తీసుకొని ధ‌ర్మ పోరాట దీక్ష‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నారు. తాను ఏం చేసినా ప్ర‌జ‌లు న‌మ్ముతార‌ని తప్పుల మీద త‌ప్పులు చేస్తున్నారు. నిన్ను న‌మ్మం బాబు అని ప్ర‌జ‌లు ముక్త‌క‌ఠంతో నిన‌దిస్తున్నారు. శిశిపాలుడు 100 తప్పులు లాగా మీ 100 రాజకీయ తప్పిదాలు, తప్పులు నిండాయి బాబు .. ఇక మిగిలింది మీ రాజకీయ నిష్క్రమాణే ...

 
1) 600 పైగా హామీలు ఇచ్చి ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చకపోవడం మొద‌టి త‌ప్పు

2) పార్టీ ఫిరాయింపులు ప్రోత్స‌హించి రాజ్యాంగానికి తూట్లు 

3) క‌లెక్ట‌ర్ల‌ను టీడీపీ నేత‌ల‌కు బానిసల లాగా పని చేయ‌మ‌ని చెప్ప‌డం 

4)  రాజధాని భూములు తగలబెట్టడం

5) అసెంబ్లీ భ‌వ‌నంలో నీరు లీక్ అయితే దాన్ని ప్రతిపక్షంపైకి నెట్ట‌డం 

6) తుని రైలు తగుల‌బెట్టడం

7) మహిళా త‌హ‌శీల్దార్‌ను జుట్టుప‌ట్టుకొని మీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని కొట్టినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం

8) ఆయేషా మీరా మరణాన్ని వాడుకుని న్యాయం చేయకపోవడం

9) రిషితేశ్వరి మరణంలో దొషులను కాపాడటం

10) ఎమ్మెల్యే రోజాను అకార‌ణంగా ఏడాది పాటు అసెంబ్లీ స‌మావేశాల నుంచి స‌స్పెండ్ చేయ‌డం 

11)  కాల్ మనీ - సెక్స్ రాకెట్‌తో ఆడవారి మాన ప్రాణాలతో ఆటలాడిన వారిని కాపాడటం

12) జన్మభూమి కమిటీల దురాగతాలు

13) డ్వాక్రా మహిళలను రుణ‌మాఫి పేరుతో మోసం చేయ‌డం

14) అంగన్‌వాడీల‌కు పెంచిన వేత‌నాలు ఇవ్వ‌క‌పోవ‌డం
15) సదావర్తి స‌త్రం భూముల కుంభకోణం

16) గోదావ‌రి పుష్కరాలలో 30 మంది అమాయ‌కుల ప్రాణాల‌ను మీ ప‌బ్లిసిటీ పిచ్చికి బ‌లి చేయ‌డం

17) తిరుపతి వెంకన్న దేవస్థానం మీద ఆరోపణలు

18) వైజాగ్ భూముల కుంభకోణం

19) హూద్ హూద్ బాధితులకు ప‌రిహారం ఇచ్చామ‌ని చెప్పి దోచుకున్న అవినీతి

20) అనంతపురం రైతులకు చెల్లించాల్సిన ఇన్‌పుట్ స‌బ్సిడీ మ‌ళ్లించ‌డం 

21) పదవులు ఇస్తా అని ఇవ్వకుండా ఆనం వివేకా, భూమా, కిడారి లాంటి వారి మరణానికి కారణం అవ్వడం

22) సోషల్ మీడియా కార్యకర్తల మీద వేధింపులు 

23) ఎమ్మెల్యే చింతమనేని ప్ర‌భాక‌ర్‌ ఆగడాలు

24 ) ఓటుకు నోటు కేసు 

25) ల్యాండ్ పూలింగ్‌లో మోసాలు

26) ఇసుక మాఫియాని ప్రోత్సహించడం

27 )ఇసుక మాఫియా కార‌ణంగా  27 మందిని చంపిన వారిని కాపాడటం

28) అగ్రిగోల్డు స్కాం..విలువైన భూములు కొట్టేయాల‌నే కుట్ర‌

29) మంత్రులు చేస్తున్న అవినీతిని వెనకేసుకుని రావడం

30 ) శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల దుర్మార్గానికి అండ‌గా నిల‌వ‌డం

31 ) ప్రత్యేక హోదా విష‌యంలో ప‌ట‌కో మాట‌

32) రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించిన కాంగ్రెస్తో జత కట్టడం

33)  హోదా కోసం పోరాడుతున్న వారి మీద కేసులు పెట్టడం

34) సమైఖ్య ఆంధ్ర కోసం పోరాడిన వారి మీద కేసులు ఎత్తేస్తా అని మోసం చేయ‌డం

35)  అశోక్ బాబు ద్వారా ఉద్యోగ సంఘాలను మోసం చేయ‌డం

36) ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద  అక్ర‌మ‌ కేసులు నమోదు చేయ‌డం

37) కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడ కుటుంబం మీద మీ దుర్మార్గం

38)  సీఎం రమేశ్ లాంటి వారిని కాపాడటం

39) మీరు చేసిన పాపాల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు తెలుగు వారికి అంటగట్టడం

40) వ్యవస్థ లలోని లోపాలను వాడుకుని స్వప్రయోజనం పొందటం

41) వ్యతిరేకంగా వార్త‌లు రాస్తున్నార‌ని పాత్రికేయుల‌పై ప్ర‌తాపం చూప‌డం, అలాంటి వారిని ఉద్యోగాల నుండి తొలగించడం

42 ) మెడాల్ స్కామ్ లో కామినేనిని కాపాడటం

43)  జేసీ దివాకర్ రెడ్డి తో వైయ‌స్ జగన్‌ను తిట్టించడం

44) ఉద్యోగులను వేధించడం

45) కేశినేని నాని లాంటి నేత‌ల‌తో ఐపీఎస్ అధికారుల‌ను బెదిరించ‌డం 

46) బెజవాడలో గుడులు కూల్చి వేయడం

47) రాష్ట్రం లోటు బ‌డ్జెట్‌లో ఉందంటూనే ప్ర‌త్యేక విమానాల్లో తిరుగుతూ..ప‌బ్లిసిటీకి కోట్లు దుబారా

48) ఏదో చెయ్యబోతున్నామంటూ అనుకూల మీడియాతో మభ్యపెట్టడం

49) నిన్నగొప్పగా చేసింది ..ఈ రోజు అన్యాయం చేసింది అంటున్న మిత్రధర్మం మ‌రిచి విమ‌ర్శించ‌డం

50)  జీడీపీ- ఆదాయ వ్యయాల తప్పుడు లెక్కలు

51) ప్యాకేజీ డ్రామాలు

52) కాంట్రాక్ట్ ఉద్యోగులను వేధించడం

53) బి‌సిలు జ‌డ్జిలుగా పనికిరారు అని ఉత్తరాలు రాయడం

54) విలువైన ప్రభుత్వ భూములు మీ బినామీల‌కు దోచిపెట్టడం

55) ఆర్టీసీ ఆస్తులను కాజేయ‌డం

56) మైనింగ్ మాఫియా లో ఉన్న ఎమ్మెల్యేలను, నాయకులను వెన‌కేసుకొని రావ‌డం

57) ఫాతిమా విధ్యార్ధులకు మోసం చేసిన వారికి స‌పోర్టు చేయ‌డం 

58)  పదే పదే రాయలసీమ వాసులను దొషులుగా చిత్రీక‌రించి మాట్లాడటం

59) మాచెర్ల మునిసిపల్ ఛైర్మన్ దంపతుల మరణానికి కారణం

60) కుల ప్రయోజనాల కోసం ఇతరులకు చేసిన అన్యాయం

61) జేసీ దివాకర్ ట్రావెల్స్ దురాగతాన్ని కాపాడటం

62) కులాల వారీగా సమాజాన్ని చీల్చి రాజకీయ ప్రయోజనాలు చూడటం

63) ఏసీబీ పేరు చెప్పి ఉద్యోగులను బెదిరించడం

64) అవినీతి తో దేశంలో నంబర్ వ‌న్ స్థానంలో నిల‌వ‌డం

65)  ట్రైమ‌క్స్‌ కుంభకోణం నుండి కోనేరు ని కాపాడటం

66) బాక్సైట్‌ తవ్వకాలు

67) ఇంటికో ఉద్యోగం అంటూ ద‌గా చేయ‌డం 

68) విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మవారి గుడిలో తాంత్రిక పూజలు

69) విదేశీ పర్యటన ముసుగులో సొంత ప్రయోజనాలు

70 ) స్వీజ్ ఛాలెంజ్ బాగోతం

71) కొండవీటి వాగు , పట్టిసీమ బాగోతం

72) తాత్కాలిక సచివాలయం 7500 పైగా ఎస్ఎఫ్టీ అంటూ దోపిడీ

73) ఏపీఎన్ఆర్‌టీ పేరిట ఉద్యోగాలు అంటూ సొంత వారికి దోచిపెట్టడం

74) రాజధాని భూములకు లండ‌న్‌లో ఆర్బిట్రైష‌న్ అనడం

75) తప్పులకు ఉద్యోగులు , ఒప్పులకు నా కష్టార్జితం అనడం

76) జిల్లాకు ఒకరు చొప్పున 13 జిల్లాలలో జరుగుతున్నా అవినీతి, దోపిడీలను చూస్తూ కాపాడటం

77) జేసీవీఎస్‌ ఆశ్రమం విషయంలో  దొషులను కాపాడటం

78) కరకట్ట కింద అక్రమంగా నిర్మించిన ఇంటిలో కాపురం ఉండటం

79 ) హైదరాబాద్‌లో ఉన్న ఇంటికి ఇక్కడ ప్రజల డబ్బుతో సోకులు, సీసీ టీవీలు 

80) నేల విడిచి సాము చేయ‌డం ... ఇక్కడ స్వైన్‌ఫ్లూ , డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఉంటే సింగపూర్, జపాన్ అంటూ భ్ర‌మ‌లు 

81) వీధికో మ‌ద్యం షాపు..బ‌డి ప‌క్క‌న‌, గుడి ప‌క్క‌న బెల్టు షాపులు

82) స్వప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడం

83) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపకపోవడం

84) ధర్మపోరాట దీక్షలు అని జనాన్ని మ‌భ్య‌పెట్ట‌డం
85) కేసు నుండి బయటపడటం కోసం నవ నిర్మాణ దీక్షలు అని ప్రజల సొమ్ముతో అనవసర ఖ‌ర్చులు

86) కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పక పోవడం

87) అంచ‌నాలు పెంచి ఆ సొమ్ముతో సొంత బినామీల ద్వారా సొంత కంపెనీల‌లో పెట్టుబడి తేవడం

88) నోట్ల ర‌ద్దు, హెరిటేజ్‌-  బిగ్ బ‌జార్ ఒప్పందం 

89) హెరిటేజ్‌ డైరెక్టర్ గా ఉన్న అహుజా కి చెందిన ఆసియన్ పెయింట్స్‌ కోసం తక్కువ ధరకే భూములు కేటాయించడం

90) ఫైబ‌ర్‌నెట్ కుంభకోణం

91) ఏపీ ఫైబ‌ర్ నెట్ అంటూ కేబుల్ నెట్‌వ‌ర్క్‌ను శాసించ‌డం, ఇతర ఛానల్స్ ప్ర‌సారం కాకుండా నిరోధించ‌డం 

92 ) సేవ్ డెమోక్ర‌సీ అంటూ ఇత‌ర రాష్ట్రాల్లో తిరగడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం

93) ఎర్రచందనం దోపిడీ దారులని కాపాడి కూలీలను ఎన్‌కౌంట‌ర్ చేయ‌డం 

94) పాలన అస్తవ్యస్తంగా ఉన్న నేనే  అనే అహం ప్రదర్శించడం

95) మంత్రుల స్వేచ్చ హరించడం -బెదిరించడం

96) రాజరిక వ్యవస్థ లాగా పాలన చేయ‌డం

97) దొంగ ఓట్లు నమోదు  చేయించ‌డం

98) ప్ర‌తిప‌క్షం ఓట్ల‌ను తొల‌గించ‌డం 

99) వైయ‌స్ జగన్‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కుట్ర‌లో సూత్ర‌దారుల‌ను, పాత్ర‌దారుల‌ను బ‌య‌ట‌కు రాకుండా కాపాడ‌టం 

100) రాష్ట్రంలోకి సీబీఐని రాకుండా ప్ర‌త్యేక జీవో తీసుకురావ‌డం, నీ త‌ప్పులు బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకు  ప్ర‌జ‌లు ర‌క్ష‌ణ‌గా ఉండాల‌ని పిలుపునివ్వ‌డం. న్యాయ వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా కుప్పం జ‌న్మ‌భూమి స‌భ‌లో వ్యాఖ్య‌లు చేయ‌డం

 

Back to Top