బాబు నోట్లో ఇసుక

 

నిజం చెప్పేది నాలుక అయితే అబద్ధం చెప్పేది తాటిమట్ట అంటారు పెద్దలు. చంద్రబాబు నోట్లు ఉన్నది నాలుకైతే కాదు. ఎందుకంటే పుట్టి బుద్ధెరిగాక బాబు నోరు నిజాలు మాట్లాడిందెప్పుడని...

ఇక ఇసుక గురించి బాబు అతిశయోక్తులకు అంతేలేదు.3,500  ఇసుక ఇప్పుడు 45,000 పలుకుతోందంటూ పచ్చి అబద్ధాలతో ప్రజలనే నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా 45,000 పెట్టి సామాన్యులైనా, లేక భారీ నిర్మాణాలు చేసేవారైనా ఇసుకను కొంటారా?

బాబు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే...

నాలుగు గదులతో ఉండే ఓ సాధారణ ఇంటి నిర్మాణానికి 15 యూనిట్ల ఇసుక కావాల్సి ఉంటే....లారీ రూ.45,000 చొప్పున 15 యూనిట్ల ఇసుకకే రూ.3,15,000 ఖర్చు అవుతుంది.

చెబితే కనీసం నమ్మేలా అన్నా ఉండాలిగదా..ఊహూ...బాబుకు అవేం పట్టవు. గ్రాఫిక్లు చూపించినంత సులువుగా లాజిక్ కు అందని అబద్ధాలు పుట్టించేస్తుంటాడు.

యూనిట్ ఇసుక గతంలో రూ.4000 నుంచి రూ.5000 ఉండేది.ఒక యూనిట్ అంటే నిర్మాణ పరిభాషలో ట్రాక్టర్ ఇసుక అని అర్థం.రవాణా ఛార్జీలు దీనికి అదనం.

బాబు గారి హయాంలో సరఫరా అయ్యే ఇసుక ఎటు తరలిపోతోందో తెలియని పరిస్థితి. ఉచితం అయినప్పుడే ఇసుక ఇంత ఖరీదు అయితే రవాణా ఛార్జీలు పోగా మిగిలిన ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టో చంద్రబాబు జవాబు చెప్పాలి. నూతన ఇసుక విధానంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయం నేడు ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది కానీ ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి కాదు.అలాగే ఇసుక మాఫియాను కట్టడి చేస్తూ, పర్మిట్ వాహనాలకే అనుమతి ఇస్తూ ఇసుక రవాణాకు పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేసారు.ఒక్క లారీ కూడా రాష్ట్రం దాటి పోకుండా నిఘా పెడుతున్నారు. మరో 14 రోజుల్లో ఇసుక కొరత లేకుండా చేస్తామని హామీ ఇస్తున్నారు.

కానీ బాబు మాత్రం నిన్నటిదాకా ఇసుక బొక్కిన నోటితో నేడు ఇసుక ఖరీదు గురించి కాలక్షేపం రూమర్లు ప్రచారం చేస్తున్నాడు.పాలనా పరంగా వైయస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేకపోవడంతో తన రాజకీయ లబ్దికి ఇసుకను ఆధారం చేసుకున్నాడు చంద్రబాబు. తుడిచిపెట్టుకుపోతున్న టీడీపీ రూపురేఖల్ని సంక్షేమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలతో నిలబెట్టుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇసుక సమస్య గురించి తన దృష్టికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పందించి స్వయంగా ఆయనే ప్రజలకు వాస్తవాలు వెల్లడించారు. 

ఇసుక కొరతకు కారణాలను స్పష్టంగా వివరించారు. ఇసుక అందుబాటులో ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాలనూ ప్రజలముందుంచారు.అయినా కూడా లోటు ఉందన్న నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నారు.

త్వరలో సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇదీ అసలైన పాలకుడు ప్రజల సమస్యపై స్పందించే తీరు. కానీ బాబులా భీరువులా సమస్యను కప్పిపుచ్చడమో, డైవర్ట్ చేయడమో, మరొకరిపై నిందలు వేసి తప్పించుకోవడమో నాయకత్వం కాదు. ప్రజలకు జవాబుదారుగా ఉన్న ప్రభుత్వం, ప్రజా క్షేమమే ముఖ్యం అనే నాయకుడి తీరు ఇలా ఉంటుంది. సంక్షోభాలను అవకాశాలనుకుంటూ రాజకీయాలకు వాడుకునే చంద్రబాబు తీరు నేడు మన కళ్లముందే కనిపిస్తోంది. 

Read Also: బాలకృష్ణ వియ్యంకుడి భూ కేటాయింపులు రద్దు

Back to Top