జగమంత కుటుంబం

  • అంతులేని ఆదరాభిమానాలు చూపుతున్న ప్రజలు
  • రెండు రోజుల్లో భారీగా వైయస్ఆర్ కుటుంబంలో చేరిక
  • బూత్ కమిటీ కన్వీనర్లకు నాయకుల దిశా నిర్దేశం
  • స్వచ్ఛందంగానూ వచ్చి చేరుతున్న సభ్యులు
  • ఊరూ వాడా జగనన్నది జగమంత కుటుంబం అంటున్న ప్రజానీకం
రాజకీయపార్టీలా కాకుండా ప్రజల మన్ననపొందే నాయకత్వం ఉండాలనే ఆశయంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రతిపక్ష నేత ప్రకటించిన నవరత్నాలను వెంటతీసుకుని పార్టీ శ్రేణులు ప్రజలల్లో మమేకం అవుతున్నాయి. స్థానిక నేతలు బూత్ కమిటీ కన్వీనర్లకు దిశా నిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ వైయస్ఆర్ కుటుంబంగా, జగమంత కుటుంబంగా మార్చే మహత్తర కార్యక్రమం అలవోకగా ప్రజల మన్ననలు పొందుతోంది. 

ప్రతి జిల్లాలోనూ అపూర్వమైన అనుభవం
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు, వైయస్ఆర్ కడప, కర్నూలు జిల్లాలు, నెల్లూరు,ప్రకాశం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనంత ఇలా వైయస్ఆర్ కుటుంబం అడుగుపెట్టిన ప్రతి చోటా ప్రజలు అనూహ్యంగా ఆదరిస్తున్నారు. నవరత్నాల సభలైనా, వైయస్ఆర్ పార్టీ ప్రాంతీయ సమావేశాలైనా, వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి ఆహ్వానమైనా ప్రజలు అశేషంగా తరలివచ్చి, తమ అభిమానాన్ని, ఆదరణని చూపించుకుంటున్నారు. రాజన్న రాజ్యం కోసం, జగనన్నుగెలిపించుకోవడం కోసం, రాష్ట్రమంతా వైయస్ఆర్ కుటుంబంగా మారేందుకు తమ సంసిద్ధతను తెలియజేస్తున్నారు. 

వైయస్ఆర్ కుటుంబానికి అనూహ్యస్పందన 
అన్ని జిల్లాల్లోనూ వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి అనూహ్యస్పందన లభిస్తోంది. ముఖ్యనేతలు, స్థానిక నేతలను సైతం కలిసి వైయస్ఆర్ కుటుంబంలో చేరమని కోరుతున్నారు. అలా అడిగిందే తడవుగా యువత, మహిళలు, పూర్వనేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున వైయస్ఆర్ కుటుంబంలో చేరుతున్నారు. సభ్యత్వం తీసుకుంటున్నారు.

చిత్తూరు జిల్లాలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడు చెవిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్ కుటుంబంలో మెదటి సభ్యత్వం తీసుకున్నారు. వైయస్ఆర్ కుటుంబాన్ని గడపగడపకూ తీసుకువెళ్లే విధంగా నియోజకవర్గంలో క్లస్టర్ల వారీగా ఇంన్ ఛార్జలను నియమించారు. ఆయా బూత్ లెవెల్ లో బూత్ కన్వీనర్లకు మార్గనిర్దేశం చేసారు. అన్ని మండలాల ఇన్ ఛార్జలను సమన్వయం చేసేందుకు ఐదుగురు నాయకులతో సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేసారు. 

తూర్పుగోదావరి జిల్లాలో సైతం విస్తృతంగా వైయస్ఆర్ కుటుంబం ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది. పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో  కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 7 నియోజకవగర్గాల్లో పార్టీ బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, స్థానిక నేతలు కలిసి ఇంటింటికీ వెళ్లి నవరత్నాల గురించి వివరించారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిన వారితో 9121091210 నెంబర్ కు మిస్ కాల్ ఇప్పించారు. సభ్యులుగా నమోదు చేసారు. పథకాలపై అవగాహన కల్పించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమేరకు నెరవేరాయో ప్రజలతో చర్చించారు. 

ఇక గుంటూరు జిల్లాలోనూ వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం ఉత్తేజపూరితంగా జరిగింది. అన్న వస్తున్నాడు కష్టాలు తొలిగిపోతాయని ఈ కార్యక్రమంలో నేతలు ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇంటి ఇంటికీ వస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలకు ప్రజలు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. నవరత్నాలతో ప్రజా సంక్షేమానికి పునాదులు పడతాయని నాయకులు పూర్తిగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిలకలూరిపేట, పొన్నూరు, తాడికొండ, వేమూరు ఇలా పలు నియోజకవర్గాల్లో వైయస్ఆర్ కుటుంబానికి ఎన్నోకుటుంబాలు సాదర ఆహ్వానం పలికాయి. వైయస్సార్ కుటుంబంతో మమేకం అయ్యాయి. 

కృష్ణా జిల్లాలో పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్నిజయప్రదంగా నిర్వహిస్తున్నాయి. టిడిపిని ఇంటికి పంపించాలంటూ వైయస్సార్ సిపి కృష్ణా జిల్లా ఇన్ ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలముందే ఎండగట్టాలని, ప్రజలందరికీ చంద్రబాబు మోసాల గురించి వివరించాలని అన్నారు. వైయస్ఆర్ కుటుంబం అంటేనే సంక్షేమం అని మల్లాది విష్ణు అన్నారు. మరో ఏడాది ఓపిక పడితే చాలని, ఈ ఏడాది కష్టపడితే రానున్నది వైయస్సార్ స్వర్ణయుగమని అన్నారు కర్నూలు జిల్లా పాణ్యం వైయస్సార్ సిపి నేతలు. పార్టీలకు అతీతంగా అభివృద్ధిపనులు చేసిన ఘనత వైయస్ఆర్దే అని, నైతిక విలువలకు తిలోదకాలిచ్చిన పార్టీ టిడిపి అని పాణ్యం నియోజకవర్గంలో జరిగిన బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశంలో పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. కర్నూలు టౌన్ లో వైయస్ఆర్ కుటుంబం  కార్యక్రమం ఘనంగా జరిగింది. కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో వైయస్ఆర్ కుటుంబం కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నవరత్నాల గూర్చి వివరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే నైజం వైయస్ఆర్ కుటుంబానిదని ఈ సదర్భంగా సభ్యత్వం తీసుకున్న వారు పేర్కొన్నారు. 

భవిష్యత్ వైయస్సార్సిపిదే అని ప్రకాశం జిల్లాలో నేతలు ఎలుగెత్తి చాటారు. ఇక విజయనగరంలో నవరత్నాల సభలకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. విజయనగరం, కొత్తవలసలో నిర్వహించిన సభలు కిటకిటలాడాయి. కొత్తవలస సభలో బొత్సా సత్యనారాయణ, విజయనగరం సభలో కోలగట్ల వీరభద్రస్వామి, బెల్లాన తదితరులు పాల్గొన్నారు. ఇతర జిల్లాలైన విశాఖపట్నం, వైయస్సార్ కడప, అనంతపురం, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోనూ వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం అప్రతిహతంగా సాగుతోంది. రానున్నది రాజన్నరాజ్యం అని, రాష్ట్రమంతా వైయస్ఆర్ కుటుంబమేనని తెలియడానికి ఎంతో కాలం పట్టదని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Back to Top