ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రైతుల్ని వెంటాడి వేధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరు ఆయన్ని కలచివేసింది. చంద్రబాబు వ్యవహార శైలిపై వైఎస్ జగన్ చేసిన పవర్ ఫుల్ కామెంట్స్..
1. మానవత్వం మరిచి రాక్షసుడిలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు

2. గత 10 నెలల కాలంలో 13 సార్లు పంటల్ని పచ్చ చొక్కా గూండాలు తగలబెట్టారు

3. ఇదంతా చంద్రబాబు పురమాయించటం, మంత్రులు అమలు చేయటం జరుగుతోంది

4. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, రైతుల జీవితాలతో ఆడుకొంటే ఊరుకొనేది లేదు

5. చంద్రబాబు ఆటలు ఎల్లకాలం సాగవు.. 2,3 ఏళ్లలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది, రైతుల భూముల్ని తిరిగి ఇచ్చేస్తుంది

6. అసైన్డ్ భూములు అంటే మీ అత్త సొత్తా

7. చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉంది

8. భూములు ఇవ్వాలని బెదిరిస్తూ ఊళ్లకు కరెంట్ కట్ చేస్తున్నారే

9. పంట పొలాల్ని తగలబెట్టేది పచ్చ చొక్కాలయితే, రైతుల్ని కేసుల్లో ఇరికిస్తున్నారే
కోటీశ్వరులు భూములతో వ్యాపారం చేసుకొంటుంటే రైతుల నుంచి భూములు లాక్కొని రోడ్డు పాలు చేస్తున్నారు.