వైెఎస్ జగన్ పది పవర్ ఫుల్ కామెంట్స్

తిరుపతిలో ప్రత్యేక హోదా మీద సదస్సులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. ముఖ్యాంశాలు..

  • మనమంతా యువతరం, మనం ఈ తరం ప్రతినిధులం
  • విద్యార్థులే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డి పెట్టే పరిస్థితి వస్తోంది
  • చంద్రబాబుకి గట్టిగా బుద్ది చెప్పే రోజు త్వరలోనే వస్తుంది.
  • చంద్రబాబు ఉద్యోగాలు ఇవ్వరు, ఉద్యోగాలు తెచ్చిపెట్టే ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించరు
  • ఏపీలో అవినీతి చేసి వందల కోట్లు సంపాదించి, ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారు.
  • అసలు చంద్రబాబు వంటి మనిషి..ఒక మనిషేనా అన్న అనుమానం కలుగుతుంది
  • ప్రత్యేక హోదా తో ఒక్క ఉత్తరాఖండ్ లోనే 490 శాతం ఉద్యోగాలు పెరిగాయి.
  • ప్రత్యేక హోదా వస్తే ప్రతీ జిల్లా హైదరాబాద్ లా మారుతుంది
  • మనం ఉద్యోగాలు అడగటం కాదు కానీ, మన దగ్గరకే పరిశ్రమలు వస్తాయి.
  • ఈ పోరాటంలో మనమంతా కలిసి నడుద్దాం..విజయం సాధిద్దాం..
Back to Top